S-400 Missiles: చైనా, పాక్‌ను ఎదుర్కొనేందుకు S-400 క్షిపణులను మోహరించనున్న భారత్: అమెరికా నిఘావర్గాలు

ష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను జూన్ నాటికి సరిహద్దు వద్ద మోహరించాలని భారత్ భావిస్తోందని అమెరికా నిఘావర్గాలు వెల్లడించాయి.

S-400 Missiles: చైనా, పాక్‌ను ఎదుర్కొనేందుకు S-400 క్షిపణులను మోహరించనున్న భారత్: అమెరికా నిఘావర్గాలు

Us Inte

S-400 Missiles: సరిహద్దుల వద్ద చైనా, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను తిప్పికొట్టేందుకు భారత్ వ్యూహాత్మక ముందడుగు వేస్తుందని, ఈక్రమంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను జూన్ నాటికి సరిహద్దు వద్ద మోహరించాలని భారత్ భావిస్తోందని అమెరికా నిఘావర్గాలు వెల్లడించాయి. ఈనేపధ్యంలో భారత్ తమ వ్యూహాత్మక అణు దళాలతో కూడిన వైమానిక, ఆర్మీ, నేవీ విభాగాలను ఆధునీకరణ చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తోందని పెంటగాన్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల అమెరికా కాంగ్రెస్ సమావేశంలో తెలిపారు. 2021 డిసెంబరులో రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ అందుకోవడం ప్రారంభించింది.

Other Stories:Bangalore Rains: బెంగళూరును ముంచెత్తిన వాన.. ఇద్దరు మృతి

ఈక్రమంలో చైనా, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తిప్పికొట్టేందుకు ఈఏడాది జూన్ నాటికీ ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థతో కూడిన క్షిపణి బలగాలను భారత్ మోహరించనుంది. కాగా, యుక్రెయిన్ పై రష్యా దాడి చేయబోతుందంటూ ముందుగా హెచ్చరించిన అమెరికా నిఘా వర్గాలే..ఇప్పుడు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. యుక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను పసిగట్టిన మూడు రోజల అనంతరం రష్యా యుక్రెయిన్ పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2021 నాటికి, భారత సైన్యం తన భూసరిహద్దులు మరియు సముద్ర సరిహద్దుల వద్ద రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అధునాతన నిఘా వ్యవస్థలను సేకరించడానికి ప్రయత్నించిందని, అందులో భాగంగానే ‘2021లో హైపర్సోనిక్, బాలిస్టిక్, క్రూయిజ్, గగనతల రక్షణ క్షిపణి సామర్థ్యాలను భారత్ అభివృద్ధి చేస్తూ వచ్చిందని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెర్రియర్ ఇటీవల జరిగిన అమెరికా చట్టసభ విచారణలో వెల్లడించారు.

Other Stories:Zelensky: కేన్స్‌ వేడుకలో యుక్రెయిన్‌ అధ్యక్షుడి భావోద్వేగ ప్రసంగం

అంతే కాకుండా సరిహద్దుల్లో శత్రుసైన్యాల కదలికలపై నిఘా ఉంచేలా భారత్ తమ అంతరిక్ష నిఘా విభాగాన్ని వినియోగించనుందని జనరల్ స్కాట్ బెర్రియర్ పేర్కొన్నారు. ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్'(ITC) ఏర్పాటుకు భారతదేశం చర్యలు తీసుకుంటోంది, ఇప్పటికే ఉన్న మూడు సైనిక సేవలలో ఈ ఐటీసీ విభాగం ఉమ్మడి సామర్థ్యాన్ని మెరుగుపరచనుంది. “రష్యాతో భారతదేశ దీర్ఘకాలిక రక్షణ సంబంధాలు బలంగా ఉన్నాయి, డిసెంబరు 2021లో ఇరు దేశాలు తొలిసారిగా ‘2 2’ ఫార్మాట్ చర్చలు జరిపాయి – భారతదేశం గతంలో అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియాలతో మాత్రమే ఉమ్మడి విదేశీ మరియు రక్షణ చర్చలు జరిపింది. అమెరికా నిఘావర్గాల అంచనా ప్రకారం హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ప్రముఖ శక్తిగా మరియు స్పష్టమైన భద్రతను అందించే దేశంగా భారత్ తన వంతు పాత్రగా స్పష్టమైన విదేశీ విధానాన్ని అవలంబిస్తున్నట్లు అమెరికా నిఘావర్గాలు పేర్కొన్నాయి.