R. krishnaiah: సామాజిక న్యాయంలో జగనే నెంబర్ వన్: ఆర్ కృష్ణయ్య

దేశంలో సామాజిక న్యాయంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నారన్నారు బీసీ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ నామినేటెడ్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

R. krishnaiah: సామాజిక న్యాయంలో జగనే నెంబర్ వన్: ఆర్ కృష్ణయ్య

R Krishnaiah

R. krishnaiah: దేశంలో సామాజిక న్యాయంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నారన్నారు బీసీ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ నామినేటెడ్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ఏపీ సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ

‘‘సామాజిక న్యాయంలో వైఎస్ జగన్ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వాలని జగన్ కోరారు. ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 15 మంత్రి పదవులు ఇచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో అందరికీ న్యాయం జరుగుతుంది. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎవరి వాటా వాళ్లకు ఇచ్చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఉన్నారు. పార్లమెంటులో ఏపీ ప్రభుత్వం తరఫున బీసీ బిల్లు పెట్టారు. బీసీ బిల్లు కోసం 35 సంవత్సరాలుగా వందలసార్లు ధర్నాలు చేశాను. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లు పెడితే, మెజారిటీ ఎంపీలు మద్దతు ఇస్తారని చెప్పాను. మూడు సంవత్సరాల క్రితమే జగన్‌ను కలిసినప్పుడు బీసీ బిల్లు పెడతామని హామీ ఇచ్చారు. అధికార బీజేపీ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేదు.

Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స

జగన్ మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బలహీన వర్గాలకు ఇవ్వాలని చట్టం చేశారు. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ, పార్టీ పరంగా 44 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు సంబంధించి ఉన్న 18 ప్రధాన డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం’’ అని కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా బీసీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.