Raithanna : ఆర్.నారాయణమూర్తి ‘రైతన్న’.. ఢిల్లీలో స్పెషల్ షో.. వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి స్పెషల్ ట్వీట్..

తాజాగా రైతు సమస్యలపై 'రైతన్న' అనే సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాని నిన్న ఢిల్లీలో ఆంద్ర అసోసియేషన్ లో స్పెషల్ షో వేశారు. ఈ సినిమా చూడటానికి ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రముఖులు.......

Raithanna : ఆర్.నారాయణమూర్తి ‘రైతన్న’.. ఢిల్లీలో స్పెషల్ షో.. వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి స్పెషల్ ట్వీట్..

R Narayana Murthy

Updated On : March 16, 2022 / 11:02 AM IST

 

R Narayana Murthy :  యాక్టర్ గా, డైరెక్టర్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆర్ నారాయణ మూర్తి. డైరెక్టర్ గా, నిర్మాతగా ప్రజా సమస్యలపై సినిమాలు తీసి విజయవంతం అయ్యారు. ఇప్పటికి కూడా ప్రజా సమస్యలపై సినిమాలు తీస్తున్నారు ఆర్ నారాయణమూర్తి. తాజాగా రైతు సమస్యలపై ‘రైతన్న’ అనే సినిమాని చిత్రీకరించారు.

రైతులు ఎదుర్కొంటున్న కష్టాలనే ఇతివృత్తంగా ‘రైతన్న’ అనే సినిమా తెరకెక్కించానని, రైతుకు గిట్టుబాటు ధర కచ్చితంగా రావాలని, ఇందుకోసం రైతులు చేస్తోన్న పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఆర్ నారాయణమూర్తి తెలిపారు. అయితే ఈ సినిమాని నిన్న ఢిల్లీలో ఆంద్ర అసోసియేషన్ లో స్పెషల్ షో వేశారు. ఈ సినిమా చూడటానికి ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రముఖులు చాలా మంది విచ్చేశారు. ఈ షో ముందు ఆర్ నారాయణమూర్తి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని కలిశారు.

Raithanna

 

Chiranjeevi : మీతో స్క్రీన్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. సల్మాన్‌పై మెగాస్టార్ ట్వీట్..

విజయసాయి రెడ్డి.. నారాయణమూర్తితో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ఈ సినిమాపై పోస్ట్ చేశారు. ”విలక్షణ నటుడు, ప్రజా సమస్యలపై సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి గారు ఢిల్లీలోని నా నివాసానికి వచ్చి కలవడం సంతోషంగా ఉంది. తన సినిమా ‘రైతన్న’ను ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ఆంధ్ర అసోసియేషన్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాభినందనలు తెలియజేస్తున్నా” అని సోషల్ మీడియాలో తెలిపారు.