Radhe Shyam: రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీ....

Radhe Shyam: రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Radhe Shyam

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకు ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన మ్యాజిక్‌ను చూపించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆశించిన మేర రెస్పాన్స్ రాలేదని.. కలెక్షన్ల పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫిగర్స్ వచ్చాయని చిత్ర వర్గాలు చెబతూ వచ్చాయి. కాగా తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Radhe Shyam: మునిగిన బయ్యర్లు.. నష్టాలను పూడ్చేపనిలో ప్రభాస్?

మార్చి 11న రాధేశ్యామ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 1న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రిలీజ్ అయిన 22 రోజుల్లోనే రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తుండటంతో ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో విక్రమాదిత్య అనే పాల్మిస్ట్ పాత్రలో ప్రభాస్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Radhe Shyam: గ్లోబల్ స్టార్ ప్రభాస్.. ఇకనైనా కాస్త ఆలోచించవయ్యా!

అయితే కథలో మాస్ అంశాలు లేకపోవడంతో, డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా రిజల్ట్ పట్ల నిరాశకు లోనయ్యారు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, ఈ చిత్రానికి దక్షిణాది భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. కాగా నార్త్‌లో ఈ సినిమాకు మిథూన్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. టీ-సిరీస్ ఫిలింస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశాయి. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో తెలియాలంటే ఏప్రిల్ 1 వరకు వేచి చూడాల్సిందే.