Radhe Shyam: మునిగిన బయ్యర్లు.. నష్టాలను పూడ్చేపనిలో ప్రభాస్?

మూడేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజవడం.. అంతే స్పీడ్ గా థియేటర్ల నుండి..

Radhe Shyam: మునిగిన బయ్యర్లు.. నష్టాలను పూడ్చేపనిలో ప్రభాస్?

Radheshyam

Radhe Shyam: మూడేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజవడం.. అంతే స్పీడ్ గా థియేటర్ల నుండి వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. ఈ సినిమాను పూర్తిగా పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ.. కథ, ప్రభాస్ మార్క్ యాక్షన్ ఇవ్వలేకపోవడంతో అటు ఫ్యాన్స్.. ఇటు ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ కాలేకపోయారు. ఇందులో ప్రభాస్ రెబల్స్ స్టార్ కాదు.. కూల్ గయ్ అని ఎంత చెప్పినా ఫ్యాన్స్ అలా చూడలేకపోయారు.

Radhe Shyam: గ్లోబల్ స్టార్ ప్రభాస్.. ఇకనైనా కాస్త ఆలోచించవయ్యా!

ఇక, కథలో పెద్దగా బలంగా లేకపోవడం.. విక్రమాదిత్య-ప్రేరణ మధ్య లవ్ ఎమోషన్ ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోవడంతో తెరపై జరిగే సీన్ల ఎమోషన్లతో ప్రేక్షకుడు ట్రావెల్ కాలేకపోయాడు. దీంతో నార్త్ నుండి సౌత్ వరకు ఎక్కడా సినిమా ఆకట్టుకోలేదు. వీకెండ్ లో కొంతమేర బెటర్ అనిపించినా ఆ తర్వాత ఘోరంగా కలెక్షన్లు పడిపోయాయి. ఓవర్సీస్ లో కొంత మేర బెటర్ అనిపించినా అది పెట్టిన బడ్జెట్ ను ఏ మాత్రం రాబట్టలేకపోయాయి. దీంతో సినిమా కొన్న బయ్యర్లు, నిర్మాతలు భారీగా నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

Radhe Shyam: ఓటీటీలో రాధేశ్యామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కాగా.. ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించుకొని నష్టపోయిన నిర్మాతలను ఉపశమనం కలిగించినట్లు కూడా టాక్ నడుస్తుంది. మూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ కు సొంత బ్యానర్ లాంటిదే. తన కుటుంబంలో వాళ్ళు కూడా కొంత మేర భాగస్వామ్యం ఉన్న ఈ సినిమా నిర్మాణంలో మిగతా వాళ్ళు కూడా రెబల్ స్టార్ స్నేహితులే. గతంలో సాహోను కూడా మూవీ క్రియేషన్స్ వాళ్లే నిర్మించగా.. అప్పుడే నష్టాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది రాధేశ్యామ్ తో మరింత నష్టాలను చూడడంతో ప్రభాస్ తన రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేసి ఆదుకుంటున్నట్లు చెప్తున్నారు.