Rahul Dravid: టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ఫస్ట్ సిరీస్ ఆ జట్టుతోనే!

భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు.

Rahul Dravid: టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ఫస్ట్ సిరీస్ ఆ జట్టుతోనే!

Dravid

Rahul Dravid: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. నవంబర్ 17వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో తన బాధ్యతలను స్వీకరించనున్నాడు రాహుల్ ద్రవిడ్. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డు వెల్లడించింది. ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నారు.

48 ఏళ్ల ద్రవిడ్, భారత అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో ఏళ్లు రాణించాడు, గత ఆరేళ్లుగా ఇండియా-A, U-19 జట్లకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. రిషబ్ పంత్, అవేష్ ఖాన్, పృథ్వీ షా, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు జూనియర్ స్థాయి నుంచి జాతీయ జట్టులోకి ప్రవేశించడంలో రాహుల్ ద్రవిడ్ పాత్ర కీలకం. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి ద్రవిడ్ అధిపతిగా ఉన్నాడు.

2021 T20 ప్రపంచ కప్ తర్వాత, న్యూజిలాండ్ జట్టు మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ మరియు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో అడుగుపెట్టనుంది. నవంబర్ 17న తొలి టీ20తో పర్యటన ప్రారంభం కానుండగా.. ఈ సిరీస్ నుంచే రాహుల్ ద్రవిడ్ టీం ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.