Manipur Violence: ఇంఫాల్‭కు 20 కిలోమీటర్ల దూరంలో రాహుల్ కాన్వాయ్ అడ్డుకున్న పోలీసులు

కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్‭పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడాల్సి ఉంది. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మాట్లాడతారు. అయితే మొదటిరోజే చురాచాంద్‭పూర్ జిల్లాలోని ప్రజలను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు

Manipur Violence: ఇంఫాల్‭కు 20 కిలోమీటర్ల దూరంలో రాహుల్ కాన్వాయ్ అడ్డుకున్న పోలీసులు

Updated On : June 29, 2023 / 3:36 PM IST

Rahul Gandhi: దాదాపుగా రెండు నెలలుగా నిప్పుల కుంపటిలో రగులుతున్న మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‭కు 20 కిలోమటర్ల దూరంలో కాన్వాయ్‭ని పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మణిపూర్ చేరుకున్న రాహుల్.. అల్లర్లకు కారణమైన చురాచాంద్‭పూర్ జిల్లాకు బయల్దేరారు. ఈ సందర్భంలోనే ఆయన కాన్వాయ్‭ని అడ్డుకుని మధ్యలోనే నిలిపివేశారు.

Uttar Pradesh : సరయూ నదిలో ‘పానీ మే ఆగ్ లగాని హై’ అంటూ యువతి డ్యాన్సులు.. మండిపడుతున్న నెటిజన్లు

కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్‭పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడాల్సి ఉంది. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మాట్లాడతారు. అయితే మొదటిరోజే చురాచాంద్‭పూర్ జిల్లాలోని ప్రజలను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు సున్నితంగా ఉండడం వల్లనే అడ్డుకోవాల్సి వచ్చిందని స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో చేసేదేమీ లేకి ఇంఫాల్‭కు తిరిగివచ్చారు.

Godzilla Ramen : “గాడ్జిల్లా రామెన్” ఇంటర్నెట్‌ను భయపెడుతున్న వంటకం

రాష్ట్రంలోని మైతీ-కుకీ జాతుల మధ్య ఏర్పడ్డ వైరం తీవ్ర పరిస్థితులకు దారి తీసింది. మే 3వ తేదీన ఈ వర్గాల మధ్య మొదటిసారి ఘర్షణలు ప్రారంభమయ్యాయి. తమను షెడ్యూల్డ్ కులాల్లో కలపాలంటూ మైతీ వర్గం నిర్వహించిన ‘ట్రైబల్ సాలిడేటరీ మార్చ్’పై దాడితో ఈ ఘర్షణ మొదలైంది. మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం వరకు ఉంటారు. వారంతా ఇంఫాల్ లోయలో ఉంటారు. ఇక నాగాలు, కుకీలు 40 శాతం ఉంటారు. వీరు ఇతర జిల్లాల్లో ఉంటారు.