Rahul Gandhi: ఇక్కడ మణిపూర్ మండిపోతోంది.. మీరేమో ఫ్రాన్సులో..: రాహుల్ గాంధీ

మణిపూర్ హింస గురించి యురోపియన్ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టారు.

Rahul Gandhi: ఇక్కడ మణిపూర్ మండిపోతోంది.. మీరేమో ఫ్రాన్సులో..: రాహుల్ గాంధీ

Rahul Gandhi

Updated On : July 15, 2023 / 12:39 PM IST

Rahul Gandhi – Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్(India) లోని మణిపూర్ (Manipur) లో హింసాత్మక ఘటనలు చెలరేగిపోతోన్న వేళ మోదీ వ్యవహరిస్తోన్న తీరు సరికాదని విమర్శించారు.

” మణిపూర్ మండిపోతోంది. భారత అంతర్గత వ్యవహారాల గురించి ఈయూ పార్లమెంట్ చర్చించింది. ఈ రెండు అంశాలపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోవైపు, బాస్టిల్ డే పరేడ్ లో మోదీ పాల్గొన్నారు. ఇందులో ఆయన పాల్గొనడానికి టికెట్ రఫేల్ వల్లే దక్కింది ” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి మోదీ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఈ విషయాన్నే గుర్తు చేశారు రాహుల్.

మణిపూర్ హింస గురించి యురోపియన్ పార్లమెంట్లో బుధవారం తీర్మానం ప్రవేశపెట్టారు. మణిపూర్ లో హింస వేళ జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఈయూ పార్లమెంట్ విమర్శించింది. మణిపూర్ అంశం దేశ అంతర్గత విషయంగా భారత్ సమాధానం ఇచ్చింది.

కాగా, ఫ్రాన్స్ పర్యటనలో మోదీ.. ఆ దేశ అత్యున్నత పురస్కారం స్వీకరించారు. బాస్టిల్‌ డే పరేడ్ లో భారత త్రివిధ దళాల బృందం పాల్గొంది. ఫ్రాన్స్‌ ఎయిర్‌ఫోర్స్ జరిపిన విన్యాసాల్లో భారత వాయుసేనకు చెందిన రఫేల్‌ జెట్లు కూడా పాల్గొన్నాయి.

Lok Sabha Elections 2024: బీజేపీ మనసు మారడానికి కారణాలేంటి? దీంతో మళ్లీ అధికారంలోకి వస్తుందా?