Karnataka elections 2023 : నిన్న స్కూటీపై ఈ రోజు సిటీ బస్సులో రాహుల్ గాంధీ వినూత్న ప్రచారం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకున్న క్రమంలో రాహుల్ తనదైన శైలిలో బెంగళూరులో చక్కర్లు కొడుతున్నారు. సామాన్య మహిళలతో సిటీ బస్సులో ప్రయాణిస్తు ముచ్చటించారు.

Karnataka elections 2023 : నిన్న స్కూటీపై ఈ రోజు సిటీ బస్సులో రాహుల్ గాంధీ వినూత్న ప్రచారం

Rahul Gandhi bus ride in Bengaluru..

Karnataka elections 2023: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023) ప్రచారంలో చురుకుగా పాల్గొంటు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. నిన్న (మే 7,2023) బెంగళూరులో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొని డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్ పై చక్కర్లు కొట్టారు. ఈరోజు బెంగళూరులో సిటీ బస్సులో ప్రయాణిస్తు మహిళలతో ముచ్చటించారు. నిన్న స్కూటీపై వెళ్తూ.. ఈ రోజు బస్సులో ప్రయాణిస్తూ రాహుల్ గాంధీ వినూత్నంగా తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాలేజీల్లో విద్యార్థులతో ముచ్చటిస్తు..ఉద్యోగస్తులతో మాటామంతీ కలుపుతు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకున్న క్రమంలో రాహుల్ తనదైన శైలిలో బెంగళూరులో చక్కర్లు కొడుతున్నారు. సామాన్య మహిళలతో సిటీ బస్సులో ప్రయాణిస్తు ముచ్చటించారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, గృహలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత ప్రయాణంపై వంటి కాంగ్రెస్ మానిఫెస్టో గురించి చెబుతున్నారు. ఇవి మీకు ఎలా అనిపిస్తున్నాయి? అని వారి అడుగుతున్నారు. బస్టాండ్ లో కాలేజీ స్టూడెంట్లతోను, మహిళలతో మాట్లాడు రాహుల్ గాంధీ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

Karnataka elections 2023: డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్‌పై రాహుల్ గాంధీ.. వీడియో

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రానికల్లా ముగియనుంది. దీంతో వీలైనంతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయా పార్టీల నేతలు యత్నిస్తున్నారు. దీంట్లో భాంగానే రాహుల్ గాంధీ ఇలా వినూత్నంగా ప్రజల్లో తిరుగుతు వారితో ముచ్చటిస్తున్నారు.అలాగే సభలు, సమావేశాలు, రోడ్ షోలతో పాటు సామన్య ప్రజలతో కలిసిపోతు వారితో ముచ్చటిస్తున్నారు. నిన్న స్కూటీపై డెలివరీ బాయ్ తోపాటు వెళ్లి ప్రచారం నిర్వహించిన రాహుల్.. ఈ రోజు బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా రాహుల్ గాంధీ కన్నింగ్ హామ్ రోడ్డులో ఉన్న‘కేఫ్ కాఫీ డే’లో కాఫీ తాగారు. ఆ తరువాత బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్ స్టాప్ కు వెళ్లారు. కాలేజీ విద్యార్ధులు,మహిళా ఉద్యోగులతో మాట్లాడారు.