Karnataka Polls: కర్ణాటకలో ఏప్రిల్ 5 నుంచి రాహుల్ గాంధీ ప్రచారం.. ఒంటరిగానే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా

వచ్చే ఏప్రిల్ 5 నుంచి రాహుల్ కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. ఒంటరిగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Karnataka Polls: కర్ణాటకలో ఏప్రిల్ 5 నుంచి రాహుల్ గాంధీ ప్రచారం.. ఒంటరిగానే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా

Karnataka Polls: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ప్రచార పర్వం ప్రారంభించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచారంలోకి దించబోతుంది కాంగ్రెస్.

Bhadradri: భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి.. సీఎం కేసీఆర్ హాజరుపై సందిగ్ధత

వచ్చే ఏప్రిల్ 5 నుంచి రాహుల్ కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. ఒంటరిగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘మాకు ఎలాంటి కూటమి అవసరం లేదు. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఒంటరిగానే గెలుస్తుంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తాం. రాహుల్ గాంధీ ఏప్రిల్ 5న రాష్ట్రానికి వస్తారు. విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. అనర్హత వేటు గురించి.. లేదా జైలుకెళ్లడం గురించి రాహుల్ ఆలోచించడం లేదు. కాంగ్రెస్ లేకుండా దేశంలో ఐక్యత సాధ్యం కాదు.

10th Exams: ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

కర్ణాటకలో ఒకే రోజు అన్ని స్థానాలకు ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. మే 10 వోటింగ్ డే మాత్రమే కాదు.. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించే రోజు కూడా’’ అని శివ కుమార్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అందుకే బీజేపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.