10th Exams: ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. మొత్తం 2,652 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.

10th Exams: ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

Representative image

10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వచ్చే ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్ల పూర్తి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి.

Karnataka polls: ప్రజల్ని బిచ్చగాళ్లు అనుకుంటున్నారు.. కాంగ్రెస్ నేత నోట్లు చల్లడంపై సీఎం బొమ్మై

ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. మొత్తం 2,652 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల్ని ఐదు నిమిషాలు ఆలస్యంగా మాత్రమే పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. 09.35 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకుంటే మాత్రమే పరీక్ష రాసేందుకు వీలుంటుంది. ఇప్పటికే హాల్ టిక్కెట్లు పాఠశాలలకు పంపించారు. హాల్ టిక్కెట్లు అందని విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. ఎటువంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

YS Viveka case: వివేకా హత్య కేసు ఏప్రిల్ 30లోగా పూర్తి చేయండి.. సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టిక్కెట్లు చూపించి, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎండ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వైద్య పరమైన ఏర్పాట్లు కూడా చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఒక ఏఎన్ఎంతోపాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలకు హాజరుకావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

AP 10th Exams 2023 : ఏప్రిల్ 3 నుంచి 10th పరీక్షలు..ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ