YS Viveka case: వివేకా హత్య కేసు ఏప్రిల్ 30లోగా పూర్తి చేయండి.. సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

ఈ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసి, విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. కాగా, ఇప్పటివరకు కేసును దర్యాప్తు చేసిన టీంను సీబీఐ మార్చేసింది.

YS Viveka case: వివేకా హత్య కేసు ఏప్రిల్ 30లోగా పూర్తి చేయండి.. సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

YS Viveka case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసి, విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది.

Bhadradri: భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి.. సీఎం కేసీఆర్ హాజరుపై సందిగ్ధత

కాగా, ఇప్పటివరకు కేసును దర్యాప్తు చేసిన టీంను సీబీఐ మార్చేసింది. ప్రస్తుత దర్యాప్తు అధికారి రాం సింగ్‌ను తప్పించింది. అతడి స్థానంలో కొత్త సిట్ ఏర్పాటు చేసింది. దీనికి డీఐజీ చౌరాసియా నేతృత్వం వహిస్తారు. ఈ విషయాన్ని సీబీఐ.. సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టుకు పంపిన ప్రతిపాదనల ప్రకారం.. కొత్త సిట్‌లో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముకేస్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీమతి, నవీను పునియా, సబ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ తెలిపింది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

సీబీఐ దర్యాప్తు ఆలస్యమవుతోందని, అందువల్ల తన భర్త శివ శంకర్‌కు బెయిల్ ఇవ్వాలని తులసమ్మ భార్య పిటిషన్ వేసింది. అయితే, సీబీఐ ఆరు నెలలలోపు విచారణ పూర్తి చేయకపోతే.. ఆ తర్వాత ట్రయల్ కోర్టులో సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.