AP 10th Exams 2023 : ఏప్రిల్ 3 నుంచి 10th పరీక్షలు..ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ

AP 10th Exams 2023 :  ఏప్రిల్ 3 నుంచి 10th పరీక్షలు..ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ

Andhra Pradesh 10th Exams 2023

AP 10th Exams 2023 : ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి (10th Class) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (AP Government) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అధికారులు విద్యార్ధులను ఎలర్ట్ చేస్తూ పరీక్షల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను వెల్లడించారు. ప్రతి సారిలాగే ఈసారి కూడా ఒక నిముషం నిబంధన అమలులో ఉంటుందని ఈ నియమాన్ని ఉల్లంఘించిన విద్యార్ధులను ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు (Exam Centres) చేరుకోవాలని విద్యార్దులకు సూచించారు.

Telangana 10th Exams: 24 నుంచి ఆన్‌లైన్‌లో పదో తరగతి హాల్ టిక్కెట్లు.. పరీక్షలపై మంత్రి సమీక్ష

ఉ.930 నుంచి మ.12.45 సమయం మధ్య పరీక్షలు జరగుతాయి. ఉ.8.45 నుంచి ఉ.9.30 వరకూ మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్ధులకు అనుమతి ఉంటుందని అధికారులు చెప్పారు. ఉ.9.30 దాటి నిముషం ఆలస్యమైనా పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. పరీక్ష సమయంలో సెల్ ఫోన్లు(cell phones), ట్యాబ్స్(tabs), ల్యాప్ట్యాప్‌లు(laptop) వంటి డిజిటల్ పరికరాలపై నిషేధం విధించామని అధికారులు చెప్పారు.

కాగా ఈ పరీక్షలకు 6,10,000 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతుండగా, మరో 55,000 మంది ప్రైవేటుగా పరీక్షలు రాయబోతున్నారు. ఈ ఏడాది నుంచి ఒకే పేపరు విధానంలో పరీక్ష జరుగుతుంది. అంటే ఒక సబ్జెక్టు రెండు పేపర్లతో కాకుండా, ఒక్క పేపర్‌తోనే వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన బ్లూ ప్రింట్, ప్రశ్నా పత్రాలు (Question Papers), ప్రశ్నలు, వెయిటేజీ (weightage) వంటి వివరాల్ని విద్యా శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్, ఏఫ్రిల్ 8న ఇంగ్లిష్, ఏప్రిల్ 10న మ్యాథమెటిక్స్ (mathematics), ఏప్రిల్ 13న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్ (Social Studies), ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్స్ (composite course), ఏప్రిల్ 18న ఒకేషనల్ కోర్స్(vocational course) పరీక్ష జరుగుతుంది.

AP 10th Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు.. హాజరుకానున్న 6.5 లక్షల మంది

విద్యార్ధులు సమాధాన పత్రంలో ఎలాంటి వ్యక్తిగత వివరాలను పొందపరచరాదని.. పరీక్ష సమయానికి ముందుగానే రాయడం పూర్తి అయినా పరీక్షా హాలులోనే ఉండాలని అధికారులు విద్యార్ధులకు సూచిస్తున్నారు. పరీక్ష సమయంలో అవసరమైన పెన్, పెన్సిల్, స్టేషనరీని విద్యార్ధులు తమ వెంట తెచ్చుకోవాలని తెలిపారు.