AP 10th Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు.. హాజరుకానున్న 6.5 లక్షల మంది

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

AP 10th Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు.. హాజరుకానున్న 6.5 లక్షల మంది

AP 10th Exams: ఆంధ్ర ప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించిన వివరాల్ని ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి వెల్లడించారు.

WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు 6,10,000 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతుండగా, మరో 55,000 మంది ప్రైవేటుగా పరీక్షలు రాయబోతున్నారు. ఈ ఏడాది నుంచి ఒకే పేపరు విధానంలో పరీక్ష జరుగుతుంది. అంటే ఒక సబ్జెక్టు రెండు పేపర్లతో కాకుండా, ఒక్క పేపర్‌తోనే వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.

Adani vs Hindenburg: అదాని-హిండెన్‌బర్గ్ అంశంపై విచారణకు కమిటీ ఏర్పాటు.. ఆదేశించిన సుప్రీం కోర్టు

ఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన బ్లూ ప్రింట్, ప్రశ్నా పత్రాలు, ప్రశ్నలు, వెయటేజీ వంటి వివరాల్ని విద్యా శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్, ఏఫ్రిల్ 8న ఇంగ్లిష్, ఏప్రిల్ 10న మ్యాథమెటిక్స్, ఏప్రిల్ 13న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్స్, ఏప్రిల్ 18న ఒకేషనల్ కోర్స్ పరీక్ష జరుగుతుంది.