Rahul Gandhi : పార్టీ కోసం ఎవరు ఏం చేశారో నాకు తెలుసు : టీ.కాంగ్రెస్ నేతలకు రాహల్ గాంధీ చురకలు, వార్నింగులు

పార్టీ అధిష్టానంతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ చురకలు వేశారు. వార్నింగ్ లు కూడా ఇచ్చారు. పార్టీ కోసం ఎవరు ఏం చేశారో..చేస్తున్నారో నాకు అంతా తెలుసు అన్నారు.

Rahul Gandhi : పార్టీ కోసం ఎవరు ఏం చేశారో నాకు తెలుసు : టీ.కాంగ్రెస్ నేతలకు రాహల్ గాంధీ చురకలు, వార్నింగులు

Rahul Gandhi Warn to Telangana congress leaders

Updated On : June 27, 2023 / 5:12 PM IST

Rahul Gandhi : తెలంగాణలో ఎన్నికలకల్లో పోటీకి కాంగ్రెస్ సర్వసిద్ధం చేసుకుంటోంది. మేం ఎన్నికలు రెడీగా ఉన్నామని..పోటీకే కాదు గెలుపు కూడా మాదేనంటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. పార్టీలో భారీగా నేతలను చేర్చుకుంటున్నారు. పార్టీ అధిష్టానంతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈక్రమంలో మంగళవారం (జూన్ 27,2023) తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ చురకలు వేశారు. వార్నింగ్ లు కూడా ఇచ్చారు.

MLA Jagga Reddy : అందరి ముందే రాహుల్ గాంధీకి అన్నీ చెబుతా : జగ్గారెడ్డి

దీంట్లో భాగంగానే రాహుల్ గాంధీ తెలంగాణలో పార్టీ కోసం ఎవరెవరు ఏం చేస్తున్నారో..ఎవరు కష్టపడుతున్నారో నాకు అన్నీ తెలుసు అంటూ చురకలు వేశారు. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ లు ఇచ్చారు. తెలంగాణలో పార్టీకోసం ఎవరెవరు ఏం చేశారో నాకు తెలుసు అంటు పనిచేయని నేతలకు పరోక్షంగా చురకలు వేశారు.మీలో మీరు విభేధాలు పెంచుకుని పార్టీకి నష్టం లేవద్దని సూచించారు. విభేధాలు ఉంటే రాష్ట్ర ఇన్ చార్జ్ తో చర్చించండీ లేదా నాతో కూడా మాట్లాడండీ అంతేగానీ పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయొద్దు అంటూ సూచించారు.

Navjot Singh Sidhu : గంగమ్మ ఒడిలో కూర్చుని సిద్ధూ కుమారుడి నిశ్చితార్థం .. నా కుమారుడు తన తల్లి కోరిక నెరవేర్చాడని ట్వీట్

ఎట్టి పరిస్థితుల్లోను పార్టీలో ఉండే విభేదాలను బయటకు వెళ్లకుండా చూసుకోండి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోండి లేదంటే రాష్ట్ర ఇన్ చార్జ్ తోను లేదా తనతోను మాట్లాడండీ అంటూ సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని దీంట్లో ఎటువంటి మినహాయింపు ఉండదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేయాలని దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని సూచించారు.

కాగా..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన హస్తం పార్టీ మాంచి దూకుడు మీద ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏ పార్టీలోకి చేరాలా? అనే నేతలకు తలుపులు బార్లా తెరిచి స్వాగతం పలుకుతోంది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక గెలుపు జోష్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను పార్టీలోకి చేర్చుకోవటానికి చేసిన కసరత్తులు ఫలించాయి. నిన్న పొంగులేటీ, జూపల్లితో పాలు పార్టీలో చేరే పలువురు నేతలను రాహుల్ గాంధీకి పరిచయం చేశారు టీపీసీసీ రేవంత్ రెడ్డి.  ఇక వీరిద్దరితో పాటు మరో 35 మంది పార్టీలో చేరటానికి రెడీగా ఉన్నారని దానికి సంబంధించిన  జాబితా రాహుల్ కు అందజేశారు రేవంత్ రెడ్డి. ఈ సమావేశం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ ఈరోజు మరోసారి సమావేశమై పలు సూచనలు చేశారు. అదే సయమంలో వార్నింగ్ లు కూడా ఇచ్చారు.

35 మందితో కూడిన జాబితా రాహుల్ కు అందజేశారు రేవంత్ రెడ్డి.