Delhi : విద్యార్ధినిని వేధిస్తున్న రైల్వే ఉద్యోగి అరెస్ట్

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధినిని వేధించిన కేసులో రైల్వే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్ధాన్ లోని అజ్మీర్ కు చెందిన బాధిత విద్యార్ధిని(20) హోం మంత్రిత్వశాఖ వెబ్

Delhi : విద్యార్ధినిని వేధిస్తున్న రైల్వే ఉద్యోగి అరెస్ట్

Railway Employee Arrested

Delhi :  ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధినిని వేధించిన కేసులో రైల్వే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్ధాన్ లోని అజ్మీర్ కు చెందిన బాధిత విద్యార్ధిని(20) హోం మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో నిందితుడిపై ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగు చూసింది.

ఫేక్ ఐడీలను ఉపయోగించి పలు సోషల్ మీడియా వేదికలపై గుర్తు తెలియని నిందితుడు తనపై పోస్టులు పెడుతున్నాడని ఢిల్లీ యూనివర్సిటీలో  డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని తన ఫిర్యాదులో పేర్కోంది. ఇందులో తన పాత స్నేహితుడి పాత్ర కూడా ఉందని ఆమె తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో ఏప్రిల్ 7వ తేదీన తన కాలేజీ బయట ఒక వ్యక్తి    తిరుగుతూ తనను వెంబడిస్తున్నాడని భాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడి (21) ని అదుపులోకి తీసుకున్నారు. అతడు రైల్వేశాఖలో రాజస్ధాన్ లోని ఆజ్మీర్ లో పని చేస్తున్నట్లు గుర్తించారు.
Also Read : Nellore : వైసీపీ నేతపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ

కాగా..నిందితుడు కూడా బాధితురాలి ప్రాంతానికి చెందిన వాడే అని విచారణలో తేలింది. ఐదేళ్ల క్రితం ఇద్దరికీ ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది.  కొన్నాళ్ల తర్వాత బాధితురాలు నిందితుడితో మాట్లాడటం మానేసింది. దీంతో నిందితుడు బాధితురాలిని వెంటపడి వేధించటం మొదలు పెట్టినట్లు తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా విద్యార్ధిని సదరు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు  తెలిసింది.