Rajamouli : మత వివాదంలో చిక్కుకున్న రాజమౌళి..

టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమానే ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. RRR సినిమాతో రాజమౌళి అండ్ టీం పలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యింది.

Rajamouli : మత వివాదంలో చిక్కుకున్న రాజమౌళి..

Rajamouli

Rajamouli : టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమానే ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. బాహుబలి సినిమాతో మన నైపుణ్యత ఏంటో అంతర్జాతీయ సినీ రంగానికి తెలియజేసిన రాజమౌళి.. RRR సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ మూవీస్ తో పోటీ పడేలా చేశాడు. ఈ నేపథ్యంలోనే పలు అంతర్జాతీయ వేడుకల్లో ఎన్నో అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఈ అవార్డుల పంటతో రాజమౌళి అండ్ టీం పలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Rajamouli : స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ.. హాలీవుడ్ వాళ్ళకి కూడా ప్రమోషన్ కి రాజమౌళే కావాలి..

ఈ క్రమంలోనే ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యింది. రామాయణం, మహాభారతం మీ చిత్రాలను ఎలా ప్రభావితం చేశాయి అంటూ విలేకరి ప్రశ్నించగా, రాజమౌళి బదులిస్తూ.. నా చిన్నతనంలో ఆ గ్రంధాల్లోని కథలు వింటూ, చదువుతూ పెరిగాను. అవి నన్ను ఎంతగానో ఆకర్షించాయి. కానీ నాకు ఆలోచించే వయసు వచ్చాక.. కథలు కాకుండా పాత్రలు, పాత్రలలోని సంఘర్షణలు మరియు వాటి మధ్య భావోద్వేగాలను చూడగలిగాను. ఆ భావోద్వేగాలే నా చిత్రాల్లో కనిపిస్తాయి అని చెప్పుకొచ్చాడు.

కానీ మీరు నాస్తికుడిని అంటూ చెప్పుకుంటారు కదా అని ఇంటర్వ్యూయర్ అడగగా, రాజమౌళి బదులిస్తూ.. నా కుటుంబం వలన నేను మొదటిలో హిందూ మతాన్ని బాగా ఫాలో అయ్యేవాడిని. కొన్నాళ్ళు సన్యాసిగా కూడా జీవించా. ఆ సమయంలోనే కొంతమంది స్నేహితులతో క్రైస్తవ మతంలోకి కూడా అడుగుపెట్టాను. ఆ తరువాత చాలా కాలం పాటు చర్చికి వెళ్ళాను, బైబిల్ చదివి ఒక క్రిస్టియన్ గా బ్రతికాను. ఇదంతా చేశాక నాకు ఒక విషయం అర్ధమైంది. మతం అనేది ఒక రకమైన దోపిడీ అని అనిపించింది. అందుకే నాస్తికుడిగా మారాను. కానీ ఆ గ్రంధాల్లోని గొప్ప కథలు, పాత్రలు నా మనసులో గట్టిగా పాతుకుపోయాయి అంటూ వివరించాడు.

అయితే రాజమౌళి ‘మతం అనేది ఒక రకమైన దోపిడీ’ అని చేసిన వ్యాఖ్యలను కొంతమంది మతవాదులు ఖండిస్తున్నారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా రాజమౌళిని దాడి చేస్తున్నారు.