Rajamouli : RRR బాలీవుడ్ సినిమా కాదు, తెలుగు సినిమా.. అమెరికాలో గర్వంగా చెప్పిన రాజమౌళి..

తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో RRR సినిమాని బాలీవుడ్ సినిమా అంటూ చెప్పడంతో రాజమౌళి మాట్లాడుతూ.. RRR సినిమా బాలీవుడ్ సినిమా కాదు, ఇది తెలుగు సినిమా. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, నేను................

Rajamouli : RRR బాలీవుడ్ సినిమా కాదు, తెలుగు సినిమా.. అమెరికాలో గర్వంగా చెప్పిన రాజమౌళి..

Rajamouli Proudly says RRR is a telugu cinema in America

Rajamouli :  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించి కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి హాలీవుడ్ లో అయితే మరింత పాపులారిటీ వస్తుంది. గత కొన్ని నెలలుగా రాజమౌళి అమెరికాలోనే ఉంటూ RRR సినిమాని మరింత ప్రమోట్ చేస్తూ హాలీవుడ్ లో అవార్డులు సాధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవలే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ గెలుచుకుంది. ఈ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. దీంతో చిత్రయూనిట్ కి దేశమంతా అభినందనలు చెప్తున్నారు. ఇక ఇప్పటికే RRR సినిమా, నాటు నాటు సాంగ్ ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్ట్ లో నిలిచాయి. ఎలాగైనా ఆస్కార్ కొట్టాలని రాజమౌళి అమెరికాలోనే ఉండి RRR ని మరింత ప్రమోట్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడు.

Sankranthi Movies : వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాల్లో మరీ ఇన్ని కామన్ పాయింట్స్.. గమనించారా??

వరుసగా అమెరికాలోని మీడియా సంస్థలతో, సినిమా వాళ్ళతో రాజమౌళి ఇంటరాక్ట్ అవుతున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో RRR సినిమాని బాలీవుడ్ సినిమా అంటూ చెప్పడంతో రాజమౌళి మాట్లాడుతూ.. RRR సినిమా బాలీవుడ్ సినిమా కాదు, ఇది తెలుగు సినిమా. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, నేను అక్కడి నుంచే వచ్చాను అని చెప్పారు. దీంతో రాజమౌళి RRR సినిమాని తెలుగు సినిమా అంటూ గర్వంగా చెప్పారు అని తెలుగు ప్రేక్షకులు అభినందిస్తున్నారు.