RRR : ఆస్కార్ క్యాంపైన్ కోసం అంత ఖర్చు చేసాం.. రాజమౌళి కొడుకు కార్తికేయ!

RRR చిత్ర యూనిట్ ఆస్కార్ క్యాంపైన్ కోసం ఎంత ఖర్చు చేసిందో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలియజేశాడు. అలాగే ఆస్కార్ (Oscar) అవార్డుని కొన్నారు అన్న వార్తలు పై కూడా స్పందించాడు.

RRR : ఆస్కార్ క్యాంపైన్ కోసం అంత ఖర్చు చేసాం.. రాజమౌళి కొడుకు కార్తికేయ!

Rajamouli son Karthikeya reveals RRR oscar campaign cost

RRR : దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్నా, ఇప్పటికి ఆ మూవీ మ్యానియా నుంచి బయటకి రాలేకపోతున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ అయితే భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో RRR కి ఇంతటి పాపులారిటీ లభించడంతో.. ఈ చిత్రాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఆస్కార్ కి (Oscar) ఎంపిక చేస్తుంది అని అందరు అనుకున్నారు.

M M Keeravani : RGV నా మొదటి ఆస్కార్ అంటున్న కీరవాణి.. చచ్చిన వాళ్లనే ఇలా పొగుడుతారు అంటున్న వర్మ!

కానీ అందరికి షాక్ ఇస్తూ గుజరాతి సినిమా ‘ది లాస్ట్ ఫిలిం షో’ని ఆస్కార్ కి ఎంపిక చేశారు. అయితే ఆ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా స్థానం దక్కించుకోలేక పోయింది. ఇక RRR ని భారత ప్రభుత్వం ఎంపిక చేయకపోవడంతో రాజమౌళి నిరాశ చెంది ఆగిపోలేదు. సొంతంగా RRR ని ప్రమోట్ చేసి ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో చిత్రాన్ని నిలిపాడు. అంతేకాదు చివరికి ఆస్కార్ ని కూడా గెలుచుకొని ఇండియాకి మొదటి ఆస్కార్ ని తీసుకు వచ్చాడు.

RRR : RRR ప్రభంజనానికి ఏడాది.. ఊహకి అందని అవార్డులు.. లెక్కకి మించిన రివార్డులు..

కాగా ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ కోసం 80 కోట్ల వరకు ఖర్చు చేసారంటూ ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ్ వ్యాఖ్యానించడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. తాజాగా దీని పై రాజమౌళి కొడుకు కార్తికేయ స్పందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ క్యాంపైన్ ఖర్చు గురించి మాట్లాడుతూ.. హాలీవుడ్ సినిమాలు క్యాంపైన్ కోసం స్టూడియోలను ఆశ్రయిస్తాయి. కానీ మనకి అటువంటి అవకాశం లేదు. అందుకనే ఆస్కార్ క్యాంపైన్ కోసం మొదట 5 కోట్ల బడ్జెట్ అనుకున్నాము. ఆస్కార్ నామినేషన్స్ లో ఎంట్రీ ఇచ్చే సమయానికి 3 కోట్ల వరకు ఖర్చు అయ్యింది. నామినేట్ అయ్యాక బడ్జెట్ కొంచెం పెంచాం.

దీంతో మొత్తం క్యాంపైన్ ఖర్చు 8.5 కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపాడు. అలాగే ఆస్కార్ కొన్నారు అంటూ వస్తున్న వార్తల పై కూడా స్పందించాడు. ఎలాపడితే అలా చేయడానికి అది మాములు పురస్కారం కాదు. 95 ఏళ్ళ చరిత్ర ఉన్న పురస్కారం. అయినా అవార్డు కొనగలం గాని, ప్రేక్షకుల అభిమానం, స్టీవెన్ స్పీల్‌బెర్గ్, జేమ్స్ కామెరాన్ మాటలు కొనలేము కదా? అంటూ చెప్పుకొచ్చాడు.