RRR : RRR ప్రభంజనానికి ఏడాది.. ఊహకి అందని అవార్డులు.. లెక్కకి మించిన రివార్డులు..

ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలయికలో రాజమౌళి తెరకెక్కించిన RRR నేటితో ఇది పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు RRR సృష్టించిన ప్రభంజనం ఏంటో ఒకసారి తెలుసుకుందామా?

RRR : RRR ప్రభంజనానికి ఏడాది.. ఊహకి అందని అవార్డులు.. లెక్కకి మించిన రివార్డులు..

rajamouli, ntr, ram charan's RRR completing one year

RRR : దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) బాహుబలి వంటి సినిమాలు తీసిన తరువాత ఎటువంటి సినిమా తీయబోతున్నాడు అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక ఎవరి అంచనాలకి అందకుండా రాజమౌళి.. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) లతో సినిమా అనౌన్స్ చేసి ప్రకటనతోనే ప్రభంజనం సృష్టించాడు. 2017 నవంబర్ 18న రాజమౌళి ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫొటోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఉండగా.. దానికి RRR అనే కాప్షన్ పెట్టి షేర్ చేశాడు. ఆ పిక్ చూసిన ప్రతి ఒకరిలో ఒకటే సందేహం.. ఈ ముగ్గురు కలిసి సినిమా చేయబోతున్నారా? దీంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యిపోయింది.

Naatu Naatu : టెస్లా కారుల ‘నాటు నాటు’ ఆటకి ఎలాన్ మస్క్ రిప్లై.. RRR రేంజ్ మాములుగా లేదుగా!

ఇక ఈ సస్పెన్స్ కొన్నాళ్ళు అలాగే కొనసాగింది. 2018 మార్చిలో ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఆ అనౌన్స్‌మెంట్ తో టాలీవుడ్‌కే కాదు, ప్రతి ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ కి వణుకు మొదలైంది. ఇది ఇలా ఉంటే.. ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్ తో రాజమౌళి ఎటువంటి సినిమాని తెరకెక్కించబోతున్నాడు అనే ప్రశ్న మొదలైంది. ఎవరు ఊహాగానాలు వాళ్ళు వెల్లడించారు. అందరి ఆలోచనకు తగ్గట్టు చేస్తే జక్కన ఎలా అవుతాడు. ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసం, చరిత్రలో అసలు కలవని ఇద్దరి స్వాతంత్ర సమరయోధులను ఒకటి చేస్తూ రాజమౌళి సాహసం చేశాడు.

దేశంలో స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో మన తెలుగువాళ్లు మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమరం భీమ్. వీరిద్దరూ స్వతంత్ర పోరాటం మొదలు పెట్టడానికి ముందు.. ఎక్కడికో వెళ్లిపోయారు. తిరిగి వచ్చిన తరువాత బ్రిటిష్ గవర్నమెంట్ పై స్వతంత్రం కోసం సమర శంఖం పూరించారు. కాగా వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిన టైం లైన్, తిరిగి వచ్చిన టైం లైన్ ఒకటే కావడం. అలాగే తిరిగి వచ్చిన తరువాత వారి ఇద్దరి పోరాటం కూడా ఒకటే కావడం రాజమౌళిని ఆకర్షించింది.

RRR Team : రాజమౌళి, RRR టీం ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి 20 లక్షలు చెల్లించారా?

ఒకవేళ వారిద్దరూ చరిత్రలో కలిసి ఉంటే.. ఏమి జరిగి ఉండి ఉంటుంది అనే ఆలోచన రాజమౌళికి మొదలైంది. ఇక అదే కథకి మొదటి మెట్టు అయ్యింది. ఇంకేముందు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రంగంలోకి దిగాడు, అద్భుతమైన కథని సిద్ధం చేసేశాడు. ఇక ఆ కథ ఏంటో, ఏ రేంజ్ లో ఉందో మనమందరం చూశాము. కాగా ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా చర్చలే జరిగాయి. రాజమౌళి ఫోటో షేర్ చేసిన సమయంలో.. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ మూడు పేరులోని మొదటి అక్షరాన్ని కలిపి వర్కింగ్ టైటిల్ గా RRR అని చెప్పుకొచ్చాడు.

అయితే ఆ టైటిల్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడంతో.. అదే టైటిల్ తో కథకి అనుగుణంగా మీనింగ్ వచ్చేలా అర్ధం కోసం చూశారు. దీని కోసం అభిమానులను కూడా అభిప్రాయాలూ అడిగారు. చివరిగా ఈ సినిమాకి.. రౌద్రం, రణం, రుధిరం (Rise Roar Revolt) అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశల పై కరోనా లాక్ డౌన్ నీళ్లు చల్లింది. దాదాపు ఏడాదిన్నర పాటు షూటింగ్ ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు షూటింగ్ మొదలు పెట్టుకొని, పూర్తి చేసుకొని 2022 మార్చి 25న ఆడియన్స్ ముందుకు వచ్చింది.

Oscars95: ఆర్ఆర్ఆర్ దెబ్బకు సైలెంట్ అయిన బాలీవుడ్ బ్యాచ్.. షారుక్ తప్ప మిగతావారు మ్యూట్!

అప్పుడు మొదలైన ఆ తుపాన్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మూవీలోని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఇండియన్ ఆడియన్స్ ని మాత్రమే కాదు హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజానికి హాలీవుడ్ ఆడియన్స్ కి RRR బాగా రీచ్ అవ్వడానికి కారణం నెట్‌ఫ్లిక్స్ అనే చెప్పాలి. ఇక జపాన్ లో అయితే ఈ సినిమా జపాన్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో ఆల్ టైం సూపర్ హిట్టుగా నిలిచింది. దాదాపు 24 ఏళ్ళ పాటు జపాన్ లో రజినీకాంత్ పేరు పై ఉన్న రికార్డుని కొల్లగొట్టడమే కాకుండా, జపాన్ లో 18 మార్వెల్ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ప్రస్తుతం అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్ల కలెక్ట్ చేసి 100 కోట్ల వైపు పరిగెడుతుంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 1258 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

ఇక అవార్డులు సంగతికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా పలు కేటగిరీల్లో 86 నామినేషన్స్ లో నిలిచింది. ఈ నామినేషన్స్ లో మొత్తం 35 అవార్డులు అందుకొని విజేతగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అందించిన నాటు నాటు సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఉపేయడంతో ఎన్నో అవార్డులు అందుకుంది. చివరికి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ కూడా అందుకొని చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమాని ఇండియన్ గవర్నమెంట్ అధికారికంగా ఆస్కార్ కి పంపిస్తారు అనుకున్నారు అంతా. కానీ RRR ని పక్కన పెట్టి గుజరాతి సినిమాని ఆస్కార్ కి పంపించారు.

Oscars95 : గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆస్కార్ చూసిన వారి సంఖ్య 12% పెరిగింది.. కారణం అదేనా?

అయితే ఆ సినిమా ఆస్కార్ బరిలో నిలవలేకపోయింది. దీని పై చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఇక రాజమౌళి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒకళ్ళు నామినేట్ చేయడం కాదు, మనకి మనంగా ఆస్కార్ బరిలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో విస్తృతంగా ప్రచారం చేశాడు. హాలీవుడ్ ఆడియన్స్ కి RRR రీచ్ అయ్యేలా చేశాడు. ఫలితంగా నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో నామినేట్ అవ్వడం, ప్రపంచ దిగ్గజ టెక్నీషియన్స్ తో పోటీ పడి ఆస్కార్ గెలవడం, ఇండియాకి మొట్టమొదటి ఆస్కార్ ని తెచ్చిపెట్టి చరిత్ర సృటించడం జరిగింది.

కేవలం అవార్డులు, రివార్డులు మాత్రమే కాదు. ప్రపంచ దిగ్గజ సాంకేతిక నిపుణులు ఈ సినిమాని చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఈ క్రమంలోనే స్టీవెన్ స్పిల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్‌ RRR ని చూసి, వీడియో కాల్స్ చేసి మరి రాజమౌళిని పొగిడేశారు. ఇక నేటితో (మార్చి 25) ఏడాది పూర్తి అయ్యింది. కానీ RRR సృష్టించిన ప్రభంజనం మాత్రం అలానే ఉంది. మరి ఈ తుఫాన్ ఎప్పుడు తీరం దాటుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం నిజం.. ఈ సినిమా మన తెలుగు వాళ్ళందర్నీ కలర్ ఎగరేసేలా చేసింది.