Rajasthan : రాజస్థాన్‌లో అంతు చిక్కని వ్యాధి.. ఏడుగురు చిన్నారులు మృతి

Rajasthan : రాజస్థాన్‌లోని సిరోమి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి అక్కడి ప్రజలను బెంబేలిత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా పిల్లలు ఈ వింత వ్యాధితో బాధపడుతున్నారు.

Rajasthan : రాజస్థాన్‌లో అంతు చిక్కని వ్యాధి.. ఏడుగురు చిన్నారులు మృతి

Rajasthan 7 Children Die In Sirohi Village Due To ‘mysterious Illness’, Health Department Hurries To Find Cause

Updated On : April 15, 2022 / 4:13 PM IST

Rajasthan : రాజస్థాన్‌లోని సిరోమి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి అక్కడి ప్రజలను బెంబేలిత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా పిల్లలు ఈ వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటివరకూ ఈ వింత వ్యాధి బారినపడి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. రోజురోజుకీ ఈ వింత వ్యాధి కేసులు ప్రబలడంతో వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అవసరమైన చర్యలను చేపట్టారు. సిరోహిలోని ఫులాబాయి ఖేరా గ్రామానికి జైపూర్, జోధ్‌పూర్ నుంచి ప్రత్యేక బృందాలు పంపుతున్నట్టు అధికారి ఒకరు వెల్లడించారు.

ప్రస్తుతానికి ఈ వింత వ్యాధి వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. దీనికి కారణాలను నిర్ధారించేందుకు ఆరోగ్య శాఖ బృందాలు గ్రామాల్లోని బాధితుల శాంపిల్స్ సేకరిస్తున్నట్లు రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి పర్సాది లాల్ మీనా పేర్కొన్నారు. సిరోమీ జిల్లాలో పిల్లల మరణాలకు గల కారణాలు, వ్యాధి వ్యాప్తికి సంబంధించి లోతుగా పరిశోధనలు జరుపనున్నట్టు వెల్లడించారు. పిల్లల మరణాలపై సిరోహి కలెక్టర్‌ భన్వర్‌లాల్‌ స్పందించారు. వైరల్‌ ఎన్‌సెఫాలిటిస్‌ కారణంగానే పిల్లలు మృతిచెందారని వైద్య బృందం అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.

చిన్నారుల మృతికి గల కారణాలపై పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. 6 రోజుల వ్యవధిలో 10 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న 7 చిన్నారులు మరణించారని తెలిపారు. ఆయా గ్రామాల్లో ఇంకా ఎంతమంది చిన్నారులు ఈ వ్యాధి బారినపడ్డారో లేదో తెలుసుకునేందుకు ఆరోగ్య శాఖ బృందాలు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నాయని అన్నారు. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో ఫిట్స్, జ్వరంతో బాధపడుతున్నారని భన్వర్ లాల్ తెలిపారు.

Read Also : Bone Cancer : ఎముకల్లో ట్యూమర్లు క్యాన్సర్ కావొచ్చేమో జాగ్రత్త!