Bone Cancer : ఎముకల్లో ట్యూమర్లు క్యాన్సర్ కావొచ్చేమో జాగ్రత్త!

ఎముకలో ఏర్పడే ట్యూమర్లు నాలుగు రకాలుగా ఉంటాయి. ఆస్టియోసార్కోమా, ఎవింగ్స్ సార్కోమా అనేవి సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపించే ట్యూమర్లు, మల్టిపుల్ మైలోమా, కాండ్రోసార్కోమా 40 నుంచి 70 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

Bone Cancer : ఎముకల్లో ట్యూమర్లు క్యాన్సర్ కావొచ్చేమో జాగ్రత్త!

Bone Cancer

Bone Cancer : కణ విభజన అదుపుతప్పటం వల్ల అసాధారణంగా కణాలు పెరగటంతో కణితిలు ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడే కొన్ని రకాల మాలిగ్నెంట్ ట్యూమర్లు క్యాన్సర్ కణుతులుగా మారతాయి. రొమ్ములు, ప్రొస్టేట్, థైరాయిడ్, కిడ్ని, ఊపిరితిత్తుల్లానే ఎముక కణజాలంలో ట్యూమర్లు ఏర్పడుతుంటాయి. అయితే అన్ని సందర్భాల్లో ఈ ట్యూమర్లు క్యాన్సర్ గా మారి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎముకలో క్యాన్సర్ కణాలతో ఏర్పడిన ట్యూమర్లు రెండు రకాలుగా చెప్పవచ్చు. ప్రైమరీ ట్యూమర్లు, సెకండరీ ట్యూమర్లు. ప్రైమరీ ట్యూమర్లను సార్కోమా అంటారు. సెకండరీ ట్యూమర్లు ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలేవీ కనుగొనలేకపోయినప్పటికీ, త్వరగా వ్యాప్తి చెందే కణాలతో ఏర్పడిన ట్యూమర్లు ఎముకలోని ఇతర ఆరోగ్య కణాలను ఆక్రమిస్తాయి. అందువల్ల ఎముక బలహీన పడి విరిగి పోయేందుకు దారితీస్తాయి. చా ట్యూమర్ల వల్ల ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అంగవైకల్యం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు.

ఎముకలో ఏర్పడే ట్యూమర్లు నాలుగు రకాలుగా ఉంటాయి. ఆస్టియోసార్కోమా, ఎవింగ్స్ సార్కోమా అనేవి సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపించే ట్యూమర్లు, మల్టిపుల్ మైలోమా, కాండ్రోసార్కోమా 40 నుంచి 70 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎముకలో ట్యూమర్ ఉన్నపుడు సాధరణంగా కనిపించే లక్షణాలు వాపు, నొప్పి. కొన్ని సార్లు కాళ్లు చేతులు కదల్చలేకపోతారు. ఎముక విరగటం ద్వారా ఎముకలో క్యాన్సర్ బయటపడుతుంది. నొప్పి లేకుండా ఏర్పడిన చిన్న కణితి పెరిగే కొద్దీ సమీపంలో ఉన్న నాడులు, కండరాల మీద ఒత్తిడి వల్ల వాపు, నొప్పి ఉంటుంది. ఎముక క్యాన్సర్‌లో క్యాన్సర్ స్థాయి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు చేస్తారు. ఎముక క్యాన్సర్‌ను నిర్ధారించడానికి రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ , క్యాన్సర్‌గా భావిస్తున్న కణితి నుంచి ఒక చిన్న ముక్క తీసి పరీక్షల కోసం ప్రయోగశాలకు టెస్టింగ్ నిమిత్తం పంపిస్తారు.

ఇతర శరీర భాగాలలో సాధారణంగా కాన్సర్లు ఏర్పడినపుడు ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణాలు బయటికి కనిపడవు. మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ ద్వారా, రేడియాలజీ ఆంకాలజిస్ట్ రేడియేషన్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. ఎముకకు నష్టం జరగకుండా నివారిస్తారు. ఎముక భాగాల్లో ఎలాంటి ట్యూమర్లు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది. వైద్యులు సకాలంలో పరీక్షలు నిర్వహించి దానికి తగిన చికిత్స అందించేందుకు వీలుంటుంది.