Rakesh Master : నన్ను అక్కడే సమాధి చేయండి.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్..

గతంలో రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చనిపోయాక తనని ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పారు.

Rakesh Master : నన్ను అక్కడే సమాధి చేయండి.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్..

Rakesh Master plans his funeral before he die said in an interview

Updated On : June 19, 2023 / 7:00 AM IST

Rakesh Master :  ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ నిన్న జూన్ 18 సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. వడదెబ్బకు గురయి, గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఎఫెక్ట్ అవ్వడంతో, పలు ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం సాయంత్రం మరణించారు. రాకేష్ మాస్టర్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, డ్యాన్సర్లు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

Rakesh Master : రాకేశ్‌ మాస్టర్‌ – శేఖర్ మాస్టర్ గొడవ ఏంటి..? అసలు వారిద్దరి మధ్య ఏమైంది..!

గతంలో రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చనిపోయాక తనని ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పారు. రాకేష్ మాస్టర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మన ఇల్లు, బంధువులు, మనుషులు ఎవ్వరూ శాశ్వతం కాదు. అన్ని మట్టిలో కలిసిపోయేవే. మా భార్య తండ్రి, మా మామ గారి సమాధి పక్కన ఓ వేప మొక్క నాటాను. ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే సమాధి చేయాలి అని కోరుకుంటున్నాను అని తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి కుటుంబ సభ్యులు రాకేష్ మాస్టర్ అంత్యక్రియలని ఎలా, ఎక్కడ నిర్వహిస్తారో ఇంకా ప్రకటించలేదు.