RC15: న్యూజిలాండ్‌లో ముగించేసిన చరణ్ అండ్ టీమ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లింది. అయితే, తాజాగా ఈ సాంగ్ షూట్‌ను ముగించేసింది RC15 యూనిట్.

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లింది. అయితే, తాజాగా ఈ సాంగ్ షూట్‌ను ముగించేసింది RC15 యూనిట్. దర్శకుడు శంకర్ తనదైన మార్క్ కంటెంట్‌తో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు ఈ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు.
RC15 : 15 కోట్లతో RC15 సాంగ్..
ఇక చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత నటిస్తున్న సినిమా కావడంతో RC15పై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆయన లుక్స్ ఎలా ఉండబోతున్నాయో సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా, ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సనిమాలో హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
Ram Charan: రొమాంటిక్ సాంగ్ కోసం ఆ దేశానికి వెళ్తోన్న RC15
తాజాగా న్యూజిలాండ్‌లో సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
And it’s a wrap in New Zealand ??
song & it’s visuals are fabulous ? @shankarshanmugh garu,@BoscoMartis & @DOP_Tirru made it even more special.@advani_kiara stunning as always?@MusicThaman u nailed it again? @ManishMalhotra @AalimHakim thank you fr amazing looks. @SVC_official pic.twitter.com/1VJ9icH7VK— Ram Charan (@AlwaysRamCharan) November 30, 2022