RC15 : 15 కోట్లతో RC15 సాంగ్..

రామ్‌చరణ్ హీరోగా ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'RC15'. భారీ అంచనాలు మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. కాగా ఈ మూవీ తరవాతి షెడ్యూల్ న్యూజిలాండలో ఉండబోతుందట. అక్కడ 12 రోజులపాటు హీరోహీరోయిన్లుపై ఒక పాట చిత్రీకరించనున్నారు. అయితే ఈ పాట కోసం...

RC15 : 15 కోట్లతో RC15 సాంగ్..

15 crores for RC15 song

RC15 : రామ్‌చరణ్ హీరోగా ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘RC15’. భారీ అంచనాలు మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. శంకర్ ఇండియన్ 2 షూటింగ్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ లేటు అవుతూ వస్తుంది. ఇటీవలే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తెరకెక్కించాడు శంకర్.

Upasana Ramcharan:”ఉపాసనా రామ్ చరణ్” పై నెటిజన్లు ఆగ్రహం

ఈ చిత్రంలో చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. కాగా ఈ మూవీ తరవాతి షెడ్యూల్ న్యూజిలాండలో ఉండబోతుందట. అక్కడ 12 రోజులపాటు హీరోహీరోయిన్లుపై ఒక పాట చిత్రీకరించనున్నారు. అయితే ఈ పాట కోసం ఏకంగా శంకర్ రూ.15 కోట్లు ఖర్చు పెడ్తున్నట్లు తెలుస్తుంది. శంకర్ గత సినిమాలు రోబో, జీన్స్ లో కూడా ఇదే తరహాలో పాటల చిత్రీకరణ ఉండేది. అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక రామ్ చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో అఖండమైన విజయాన్ని అందుకోవడం, సోషల్ కథాంశంతో సినిమాలు తెరకెక్కించే శంకర్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో.. ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, అంజలి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.