Ram Charan: రొమాంటిక్ సాంగ్ కోసం ఆ దేశానికి వెళ్తోన్న RC15

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట.

Ram Charan: రొమాంటిక్ సాంగ్ కోసం ఆ దేశానికి వెళ్తోన్న RC15

Ram Charan RC15 Heading To New Zealand For A Romantic Song Shoot

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ
సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో
చరణ్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Ram Charan: ఫ్యాన్స్ ని నిరాశపరిచిన రాంచరణ్..RC15 గురించి షాకింగ్ న్యూస్!

అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్‌ను
చిత్రీకరించేందుకు శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ సాంగ్ షూటింగ్‌ను నవంబర్ 20 నుంచి జరుపుకోవాలని వారు భావిస్తున్నారట. అయితే ఈ రొమాంటిక్ సాంగ్ కోసం
న్యూజీల్యాండ్‌లోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

Ram Charan: RC15 నుంచి లీకైన ఫోటోలు.. అంచనాలను పెంచేస్తున్న రాంచరణ్, శంకర్ సినిమా!

ఈ సినిమాలోని ఈ రొమాంటిక్ సాంగ్‌ను చరణ్, కియారా అద్వానీలపై అందంగా చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ సాంగ్ షూటింగ్ ముగియగానే, తిరిగి టాకీ
పార్ట్ షూటింగ్ చేయాలని వారు భావిస్తున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు వెయిట్
చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో చరణ్‌తో పాటు పలువురు విలక్షణమైన యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.