Waltair Veerayya : వీరయ్య విజయ విహారానికి చిట్టిబాబు..

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద వీర విహారం చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కాగా ఈ ఈవెంట్ కి మెగాపవర్ స్టార్ చీఫ్ గెస్ట్ గా...

Waltair Veerayya : వీరయ్య విజయ విహారానికి చిట్టిబాబు..

waltair veerayya

Waltair Veerayya : ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద వీర విహారం చేశాడు. వింటేజ్ లుక్స్, కామెడీ అండ్ యాక్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులకు పూనకాలు రప్పించాడు. ఈ మూవీలో టాలీవుడ్ లోని మరో హీరో రవితేజ కూడా నటించి ప్రేక్షకులకు కిక్ ఇచ్చాడు. దర్శకుడు బాబీ తన అభిమాన హీరోని వింటేజ్ వెర్షన్ లో చూపించడంలో బాగా సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఇక కలెక్షన్స్ పరంగా ఈ మూవీ సృష్టిస్తున్న రికార్డులు మాములుగా లేవు. కేవలం 10 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.

Waltair Veerayya : 2.25 రేటింగ్ ఇచ్చారు.. నేడు 2.25 మిలియన్స్ సాధించింది.. చిరంజీవి!

ఓవర్ సీస్‌లో కూడా ఈ మూవీ దూకుడు ఓ రేంజ్ ఉంది. 2.25 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ అందుకొని చిరు స్టామినా ఏంటో తెలియజేసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ‘వీరయ్య విజయ విహారం’ అంటూ ఈ శనివారం వరంగల్ హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సక్సెస్ మీట్ ని నిర్వహిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే న్యూస్ చెప్పారు నిర్మాతలు.

ఈ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్లు తెలియజేసింది. చాలా రోజులు తరువాత చిరు, చరణ్ ఒకే స్టేజి పై కనిపించబోతున్నారు అనే వార్త తెలియడంతో మెగా అభిమానులు సంబరపడుతున్నారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ అనారోగ్యం కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయింది. మరి ఇప్పుడైనా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అలాగే రవితేజ కూడా ఈ ఈవెంట్ కి వస్తున్నాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.