Ram Charan : మరదలితో కలిసి స్టెప్పులేసిన మెగా పవర్ స్టార్

ఇంటి అల్లుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వెళ్లి హంగామా చేశారు. ఇక సంగీత్ లో అందరూ డ్యాన్సులు వేసి అలరించారు. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు.....

Ram Charan :  మరదలితో కలిసి స్టెప్పులేసిన మెగా పవర్ స్టార్

Ram Charan

Updated On : December 10, 2021 / 8:48 AM IST

Ram Charan :  మెగా కోడ‌లు ఉపాస‌న సోద‌రి అనుష్పాల వివాహ వేడుకలు గత వారం రోజుల నుంచి జరుగుతున్న సంగతి తెలిసందే. అనుష్పాల వివాహం అర్మాన్ ఇబ్రహీంతో మొన్న డిసెంబ‌ర్ 8న ఘ‌నంగా జరిగింది. ఎంగేజ్‏మెంట్ నుంచి పెళ్లి వరకు అన్ని గ్రాండ్ గా చేశారు. ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ ట్రైన్‌లో 3000 మంది అభిమానులు

ఈ పెళ్ళికి సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసారు. ఇంటి అల్లుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వెళ్లి హంగామా చేశారు. ఇక సంగీత్ లో అందరూ డ్యాన్సులు వేసి అలరించారు. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే రామ్ చరణ్‌ ఉపాసన చెల్లి, తన మరదలితో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ తన మరదలితో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. మొత్తానికి ఈ పెళ్ళిలో సెలబ్రిటీలు బాగా ఎంజాయ్ చేశారు.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)