Ram Charan : నాటు నాటు తెలుగు పాట కాదు ఇండియన్ సాంగ్.. ఢిల్లీలో రామ్‌చరణ్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ ముగియడంతో ఇప్పటికే ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఇండియా చేరుకున్నారు. తాజాగా రామ్ చరణ్ కూడా ఇండియా చేరుకున్నాడు. అయితే చరణ్ హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వలేదు దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు.

Ram Charan : నాటు నాటు తెలుగు పాట కాదు ఇండియన్ సాంగ్.. ఢిల్లీలో రామ్‌చరణ్!

ram charan landed at delhi from oscars

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ ముగియడంతో ఇప్పటికే ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఇండియా చేరుకున్నారు. తాజాగా రామ్ చరణ్ కూడా ఇండియా చేరుకున్నాడు. అయితే చరణ్ హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వలేదు దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. ఇటీవల రామ్ చరణ్.. దేశంలో జరిగే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Ram Charan : నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా ఈ చిన్న టెంపుల్ ని తీసుకెళతాం.. అమెరికాలో చరణ్, ఉపాసన పూజలు..

ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో నేడు, రేపు (17,18) జరగనుంది. నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే ఈ ప్రోగ్రాంలో దేశంలోని వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్, అమిత్ షా, కేంద్ర మంత్రులు జయశంకర్, స్మృతి ఇరానీ, జాన్వీ కపూర్, శశిథరూర్ తదితరులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో చరణ్, మోదీతో సినిమా రంగం గురించి, ఆస్కార్ గెలవడం గురించి వివరించనున్నాడు.

Ram Charan : మోదీతో కలిసి ఇండియా స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో మాట్లాడబోతున్న రామ్ చరణ్..

ఈ క్రమంలోనే అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నాడు చరణ్ అండ్ ఉపాసన. ఈరోజు సాయంత్రం మోదీ ని కలవనున్నారు ఈ స్టార్ కపుల్. ఇక ఢిల్లీలో ఫ్లైట్ దిగిన చరణ్ కి ఘన స్వాగతం పలికారు అభిమానులు. కాగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ”నాటు నాటు పాటకి ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్ చూసి మేము గర్విస్తున్నాము. వారి కృషి వల్ల రెడ్ కార్పెట్‌పైకి వెళ్లి భారత్‌కు ఆస్కార్‌ తీసుకొచ్చాం. RRR సినిమా చూసి, నాటు నాటు పాటను సూపర్‌హిట్ చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు. నాటు నాటు తెలుగు పాట కాదు, నాటు నాటు ఇండియన్ సాంగ్. ఇది ఆస్కార్ అవార్డుల కోసం మనకి ఒక మార్గాన్ని ఇచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.