Bharat Jodo Yatra : రాహుల్‌కి ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా : అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్
రాహుల్‌కి ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా ఆకాంక్షిస్తూ అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ లేఖ రాశారు.

Ram temple head priest writes to Rahul Gandhi, extends wishes for Bharat Jodo Yatra
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ లో ప్రవేశించింది. తొమ్మిది రోజుల విరామం తరువాత జోడో యాత్రకు విరామం ఇచ్చిన రాహుల్ గాంధీ తిరిగి తన యాత్రను యూపీలో ప్రారంభించారు. ఈ యాత్రలో రాహుల్ తో కలిసి ఎంతోమంది అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి ఆ శ్రీరాముడి ఆశీస్సులు కలగాలని భావిస్తున్నానంటూ అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారీ ఆచార్య సత్యేంద్ర దాస్ రాహుల్ గాంధీకి లేఖ ద్వారా తెలిపారు. రాముడి ఆశీస్సులు రాహుల్‌కు లభించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు రాహుల్ చేపట్టిన యాత్ర ఉద్దేశం మంచి ఫలితాలను ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. రాహుల్ ని ఉద్ధేశిస్తూ ‘‘మీరు ప్రజల ప్రయోజనాల కోసం వారి సంతోషం కోసం ఉత్తమమైన లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీకు రాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’’ అని లేఖలో సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు.
ఈ లేఖపై అయోధ్య జిల్లా అధికార ప్రతినిథు సునీల్ కృష్ణ గౌతం మాట్లాడుతూ ‘‘ సత్యేంద్ర దాస్ ఈ యాత్రలో పాల్గొనాలనుకున్నారు. కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో పాల్గొనలేకపోయారు. దీంతో ఆయన నైతిక మద్దతును ఈ విధంగా లేఖద్వారా వెల్లడించారని అన్నారు. ఇప్పటికే రాహుల్ జోడో యాత్ర 110 రోజుల్లో దేశవ్యాప్తంగా 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకొంది. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారీలో మొదలైన యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్,మహారాష్ట్ర, హరియాణలను దాటి యూపీలో ఘజియాబాద్‌లోకి ప్రవేశించింది. జనవరి 26 శ్రీనగర్‌లో ఈ యాత్ర ముగియనుంది. ఈ యాత్రకు యూపీ ప్రతిపక్ష నాయకులు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి మద్దతు పలికారు. యాత్ర ముగింపు ఓ భారీ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.