Ram : ది వారియర్ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్ గా మారిన రామ్..

  మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న ది వారియర్ థియేట్రికల్ రైట్స్ కు ఇప్పటికే 40 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు.........

Ram : ది వారియర్ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్ గా మారిన రామ్..

Warrior Movie

The Warrior :  మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న ది వారియర్ థియేట్రికల్ రైట్స్ కు ఇప్పటికే 40 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టీమ్ నుంచి అందుతున్న సమాచారం. అంతే కాదు, వైజాగ్ ఏరియా హక్కులను స్వయంగా ఈ యంగ్ హీరోనే సుమారు 4.5 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశాడని టాక్ వినిపిస్తోంది. దాంతో ఈ సినిమా పైన ఇతర పంపిణీ దారులతో పాటు, ప్రేక్షకులకూ అంచనాలు పెరిగాయి. తన సినిమాని తానే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాడంటే ఈ సినిమాపై రామ్ కి భారీ అంచనాలే ఉన్నాయని తెలుస్తుంది.

టాప్ స్టార్సే కాదు, మీడియం రేంజ్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు దారులు వేసుకుంటున్నారు. అందులో ముందు వరసలో ఉన్నాడు రామ్ పోతినేని. ప్రస్తుతం ది వారియర్ బైలింగ్వల్ సినిమాతో తెలుగు, తమిళ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయబోతున్నాడు రామ్. ఇలా పాన్ ఇండియా మార్గం సులభం చేసుకుంటున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బుల్లెట్టు సాంగ్ తో తెలుగు, తమిళ్ లో కలిపి హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి, బుల్లెట్టు వేగంతోనే ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాడు.

Tamil Movies : క్లాసిక్ హిట్స్‌కి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న కోలీవుడ్..

ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ది వారియర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తోన్న కృతిశెట్టి మరింత గ్లామర్ డోస్ పెంచి, రామ్ సరసన నటిస్తోంది. ఈ సినిమాలో వైలెంట్ పోలీస్ ఆఫీసర్ సత్య క్యారెక్టర్ లో రామ్ కనిపిస్తుండగా, విలన్ గా ఆదిపినిశెట్టి కనిపించబోతున్నాడు. ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. పందెంకోడి 2 ఫ్లాప్ తర్వాత లింగుస్వామి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్. మరి మంచి మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న లింగుస్వామి, ఉస్తాద్ రామ్ కు ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో చూడాలి.