Telangana Politics: అసమ్మతుల పంచాయతీకి పుల్‭స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ కాల్ తో రామగుండం అసమ్మతి నేతలు ఈరోజు ఉదయమే హైదరాబాద్ వెళ్లి కేటీఆర్‭ను కలిశారు. అంతకు ముందే వారితో కరీంగనర్ లో వారితో మంత్రి కొప్పు సమావేశం అయ్యారు

Telangana Politics: అసమ్మతుల పంచాయతీకి పుల్‭స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్

KTR on Ramagundam: అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిలో అసమ్మతుల వర్గాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వవద్దంటూ ఏకంగా అధిష్టానానికి వినపడేలా ఆందోళన చేస్తున్నారు. కాగా, రామగుండం విషయమై అసమ్మతులను బుజ్జగించి వర్గాల గొడవలకు చెక్ పెట్టేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అసమ్మతి నేతలతో ఆయన సమావేశం అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‭కు టికెట్ ఇవ్వవద్దని అసమ్మతి నేతలు ఫిర్యాదు చేయగా.. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అభ్యర్థుల్ని నిర్ణయిస్తామని, సర్వే ప్రకారమే టికెట్లు పంపిణీ అవుతాయని వారికి కేటీఆర్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.

Justice Rohit B Deo: ‘‘నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయను’’ అంటూ ఉన్నపళంగా రాజీనామా చేసిన హైకోర్టు జడ్జీ

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ కాల్ తో రామగుండం అసమ్మతి నేతలు ఈరోజు ఉదయమే హైదరాబాద్ వెళ్లి కేటీఆర్‭ను కలిశారు. అంతకు ముందే వారితో కరీంగనర్ లో వారితో మంత్రి కొప్పు సమావేశం అయ్యారు. చందర్ స్థానంలో తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఆశావాహులు అంటున్నారు. ఇక ఈ సమావేశం అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ రామగుండం అంవం 90 శాతం సమసిపోయినట్టేనని అన్నారు. చందర్ కు వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నవారంతా ఉద్యమనాయకులని, గతంలో తన నాయకత్వంలో పని చేసినవారని అన్నారు. రామగుండం ఇంచార్జీగా కొప్పుల ఈశ్వర్ ఉన్న సంగతి తెలిసిందే.