Rashmika Mandanna : ఉమెన్స్‌డే రోజు బోల్డ్ ఫొటోలతో మ్యాగజైన్ పై రచ్చ చేసిన రష్మిక

తాజాగా పాపులర్ మ్యాగజైన్ హలో ఇండియా కవర్ పేజీపై రష్మిక అందాల విందు చేసింది. హాలో కవర్ పేజీ కోసం రష్మిక మరింత హాట్ గా పోజులిచ్చింది. హలోఇండియా మ్యాగజైన్ సోషల్ మీడియా వేదికగా......

Rashmika Mandanna :  ఉమెన్స్‌డే రోజు బోల్డ్ ఫొటోలతో మ్యాగజైన్ పై రచ్చ చేసిన రష్మిక

Rashmika

Updated On : March 9, 2022 / 4:30 PM IST

Rashmika Mandanna :  ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్ గా మారి స్టార్ హీరోయిన్ అయిపొయింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలతో బిజీ అయిపొయింది రష్మిక. ప్రస్తుతం రష్మిక ఫుల్ ఫామ్ లో ఉంది. చేతిలో దాదాపు అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ కాక మరో పక్క యాడ్స్ తో కూడా బిజీగా ఉంటుంది. ఇటీవల మెల్లి మెల్లిగా తన లోని బోల్డ్ నెస్ ని బయటకి తీస్తుంది. హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది రష్మిక.

తాజాగా పాపులర్ మ్యాగజైన్ హలో ఇండియా కవర్ పేజీపై రష్మిక అందాల విందు చేసింది. హాలో కవర్ పేజీ కోసం రష్మిక మరింత హాట్ గా పోజులిచ్చింది. హలోఇండియా మ్యాగజైన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రష్మిక ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కవర్ పేజీలో రష్మిక బోల్డ్ గా కనిపించడంతో కొంతమంది ఆశ్చర్యపోతే కుర్రకారు అభిమానులు మాత్రం ఆనందిస్తున్నారు.

Samantha : డోసు పెంచి ఆల్కహాల్‌ని ప్రమోట్ చేస్తున్న సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

అయితే ఉమెన్స్‌డే రోజే ఈ ఫోటోలని విడుదల చేయడం చర్చలకు దారి తీసింది. ఇప్పుడు అంతా రష్మిక బోల్డ్ ఫోటోల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొన్ని ఫోటోలు మాత్రమే రిలీజ్ చేశారని, మరిన్ని బోల్డ్ ఫోటోలు ఇంకా ఉన్నాయని సమాచారం. స్టార్ హీరోయిన్ అయ్యే కొద్ది రష్మిక కూడా తనలోని బోల్డ్ బ్యూటీని బయటపెడుతోంది మెల్లి మెల్లిగా.

View this post on Instagram

A post shared by HELLO! India (@hellomagindia)