Telangana : ఎలుకలను పట్టే గ్లూట్రాప్‌లపై నిషేధం!

ఎలుకలను పట్టేందుకు ఉపయోగించే గ్లూట్రాప్‌ (జిగురుతో కూడిన ఉచ్చు)ను నిషేదిస్తున్నట్లు తెలంగాణ పశుసంవర్ధకశాఖ ప్రకటించింది.

Telangana : ఎలుకలను పట్టే గ్లూట్రాప్‌లపై నిషేధం!

Telangana

Telangana : ఎలుకలు పట్టేందుకు బోనులకంటే గ్లూట్రాప్‌ (జిగురుతో కూడిన ఉచ్చు)ను అధికంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించింది తెలంగాణ పశుసంవర్ధకశాఖ. ఇలా జిగురుతో ఎలుక చిక్కుకోవడం వలన చాలా నొప్పి ఉంటుందని.. అది తప్పించుకునేందుకు యత్నించిన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుందని ఇలా హింసించడం చట్ట ప్రకారం నేరమని చెబుతూ ఈ గ్లుట్రాప్ ను నిషేదిస్తున్నట్లు ప్రకటించింది.

గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం- 1960లోని సెక్షన్‌ 11 స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేసింది. నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఎలుకల సంతతి తగ్గించేందుకు ఉచ్చు, లేదా బోను ద్వారా పట్టుకోవాలని సూచించింది పశుసంవర్ధకశాఖ.