Raviteja-Siddhu : రవితేజ-సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ లో సినిమా??

ఫుల్ ఎనర్జీ హీరోలైన రవితేజ, సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ అని చెప్పగానే చాలా సరికొత్తగా ఉంటుందని, ఏ రకమైన కథతో వస్తారో, ఏ సినిమా రీమేక్ అని అబిమానులు ఈ సినిమా అప్డేట్ గురించి.............

Raviteja-Siddhu : రవితేజ-సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ లో సినిమా??

Raviteja and siddhu jonnalagadda combo in a remake movie news goes viral

Updated On : January 24, 2023 / 11:24 AM IST

Raviteja-Siddhu :  మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి 100 కోట్ల సినిమాలు సాధించాడు. ఈ తర్వాత కూడా రవితేజకి మంచి ఆసక్తిగల సినిమాలతో భారీ లైనప్ ఉంది. ఇక యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం సిద్ధూ డీజే టిల్లుకి సీక్వెల్ చేస్తున్నాడు. మరి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా సిద్ధూ చేతిలో ఉన్నాయి.

తాజాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మాస్ మహారాజ రవితేజ, యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతుంది. సంతోషం, సంబరం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు దశరథ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కాంబినేషన్ గురించి మాట్లాడాడు. దశరథ్ మాట్లాడుతూ.. రవితేజ-సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. అది కూడా ఒక రీమేక్ సినిమా. ఆ సినిమాకి నన్ను దర్శకత్వం వహించమని అడిగారు. కానీ ఆ జోనర్ సినిమాలు నాకు చేయాలని లేదు. దీంతో కేవలం రైటర్ గా పనిచేస్తున్నాను. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నాను అని తెలిపారు.

Dasaradh : పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చేది రీమేక్ సినిమానే.. కానీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

ఫుల్ ఎనర్జీ హీరోలైన రవితేజ, సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ అని చెప్పగానే చాలా సరికొత్తగా ఉంటుందని, ఏ రకమైన కథతో వస్తారో, ఏ సినిమా రీమేక్ అని అబిమానులు ఈ సినిమా అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తమిళ్ లో SJ సూర్య, శింబు నటించిన మానాడు సినిమాకి రీమేక్ సినిమాలో వీరిద్దరూ నటించబోతున్నారని అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ వద్ద ఉన్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఏ సినిమాతో వస్తారో చూడాలి.