Raviteja: రవితేజ పాత్ర అలా ఉండబోతుందా?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘థమాకా’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన నటిస్తున్న....

Raviteja: రవితేజ పాత్ర అలా ఉండబోతుందా?

Raviteja Character To Be Like This

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘థమాకా’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన నటిస్తున్న ధమాకా చిత్రంలో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో రవితేజ పాత్రలను ఆయన ఎలా డిజైన్ చేశాడా అనే టాక్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

Raviteja: చిరు సినిమాలో రవితేజ పాత్ర అలా ఉంటుందా..?

అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ పాత్రలు అల్టిమేట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ ఫస్టాఫ్ లో కనిపించే పాత్ర చాలా కూల్ గా ఉంటుందని, ఆయన తరుచూ చేసే పాత్రల లాగే ఇది కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కు రెండో పాత్ర ఎంటర్ అవుతుందని.. అది పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా ఉంటుందని తెలుస్తోంది. పూర్తి ఎనర్జిటిక్ గా ఈ పాత్రలో రవితేజ పర్ఫార్మెన్స్ మరో లెవెల్ లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

NBK-RaviTeja: మాస్ రాజాతో బాలయ్య.. మరో క్రేజీ మల్టీస్టారర్?

ఇక ధమాకా చిత్రంలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలా నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్స్ట్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.