Ravanasura Movie: రవితేజ ‘రావణాసుర’ మూవీకి ఎక్స్‌ట్రా షోలు.. ఎక్కడో తెలుసా..?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాకు ఏపీలో స్పెషల్ షోలు కూడా పడనున్నట్లు తెలుస్తోంది.

Ravanasura Movie: రవితేజ ‘రావణాసుర’ మూవీకి ఎక్స్‌ట్రా షోలు.. ఎక్కడో తెలుసా..?

Raviteja Ravanasura Movie Gets Special Shows In AP

Ravanasura Movie: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ అంచనాలను రెట్టింపు చేశాయి ఈ మూవీ పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్స్. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింతగా పెంచేశాడు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Ravanasura Movie: ఇదెక్కడి మాస్ మావా.. రవితేజ సినిమా పెద్దలకు మాత్రమేనా..?

ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సుధీర్ వర్మ తీర్చిదిద్దడంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, నిన్న(మార్చి 30న) రిలీజ్ అయిన నాని ‘దసరా’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకెళ్తుండటంతో ఈ సినిమా ప్రభావం రవితేజ రావణాసురపై పడుతుందా అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. కానీ, ఇలాంటివేమీ పట్టించుకోకుండా, రావణాసుర మాత్రం గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యాడు.

Ravanasura Movie: రావణాసుర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసిన మాస్ రాజా!

ఇప్పటికే ఈ సినిమాకు ఏపీలో స్పెషల్ షోలు కూడా పడనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నాలుగు రెగ్యులర్ షోలతో పాటు ఉదయం 7 గంటల షో కూడా ఏపీలో పడనున్నట్లు తెలుస్తోంది. ‘దసరా’కు నైజాంలో ఎక్కవ రెస్పాన్స్ దక్కుతుండటంతో ఏపీలో రావణాసురకు ఈమేర 5 షోలు వేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి నైజాంలో ఈ సినిమాకు 5 షోలు పడతాయా లేక, నాలుగు షోలతోనే రిలీజ్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ లాయర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రావణాసుర ఎక్స్‌ట్రా షోలు ఈ సినిమా విజయానికి ఎంతమేర ఉపయోగపడతాయో చూడాలి.