Ravanasura Movie: రావణాసుర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసిన మాస్ రాజా!

మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Ravanasura Movie: రావణాసుర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసిన మాస్ రాజా!

Date And Venue Locked For Raviteja Ravanasura Pre-Release Event

Ravanasrua Movie: మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో రవితేజ పాత్ర ప్రేక్షకులు ఊహించని విధంగా డిజైన్ చేసినట్లుగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Ravanasura Trailer: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న రావణాసుర.. 10 మిలియన్ వ్యూస్‌తో మాస్ ఫీస్ట్

ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ మేరకు రావణాసుర ప్రీ-రిలీజ్ వేడుకకు సంబంధించిన డేట్ అండ్ ప్లేస్‌ను లాక్ చేశారు చిత్ర యూనిట్. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏప్రిల్ 1న సాయంత్రం 6 గంటల నుండి ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Ravanasura: మాస్ రాజా రావణాసుర.. ఇది పక్కా ఒరిజినల్!

దీంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఈవెంట్‌కు ఎవరెవరు వస్తారా.. ఈ ఈవెంట్‌లో గెస్టుగా ఎవరు కనిపిస్తారా అని మాస్ రాజా అభిమానుల్లో ఆసక్తి నెలకొది. ఇక ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా, మరో హీరో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయెల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.