Ravanasura: మాస్ రాజా రావణాసుర.. ఇది పక్కా ఒరిజినల్!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఓ రీమేక్ చిత్రం అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిత్ర రచయిత శ్రీకాంత్ విస్సు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇదొక పక్కా ఒరిజినల్ మూవీ అని ఆయన తేల్చి చెప్పారు.

Ravanasura: మాస్ రాజా రావణాసుర.. ఇది పక్కా ఒరిజినల్!

Raviteja Ravanasura Movie Is Not A Remake Says Writer

Ravanasura: మాస్ రాజా రవితేజ ఇటీవల ‘ధమాకా’ అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి చేస్తూ దూసుకెళ్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక దర్శకుడు సుధీర వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను షురూ చేసింది చిత్ర యూనిట్.

Ravanasura : తనలోని రావణాసురుడిని ఆ రోజే పరిచయం చేస్తాను అంటున్న రవితేజ..

అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. రావణాసుర చిత్రం ఓ రీమేక్ మూవీ అని.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా అలరిస్తుందా అనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న చిత్ర రైటర్ శ్రీకాంత్ విస్సా, తాజాగా దీనిపై స్పందించారు. ‘రావణాసుర’ చిత్రం పక్కా ఒరిజినల్ మూవీ అని.. ఇది ఏమాత్రం రీమేక్ కాదు అని.. రవితేజ పాత్రను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టామని ఆయన తెలిపాడు.

Ravanasura: మాస్ రాజా సినిమాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ఉన్నాయట!

ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన అంశం ఉంటుందని.. అది ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఆయన అన్నారు. ఇలా రావణాసుర చిత్ర రైటర్, ఈ సినిమాపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమాలో రవితేజతో పాటు హీరో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయెల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజితా పొన్నాడ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.