Ravanasura Trailer: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న రావణాసుర.. 10 మిలియన్ వ్యూస్‌తో మాస్ ఫీస్ట్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. యూట్యూబ్’లో రావణాసుర ట్రైలర్ దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.

Ravanasura Trailer: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న రావణాసుర.. 10 మిలియన్ వ్యూస్‌తో మాస్ ఫీస్ట్

Raviteja Ravanasura Trailer Trending On Youtube With 10 Million Views

Ravanasura Trailer: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటేందుకు రవితేజ సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Ravanasura Trailer : ఈ భూమి మీద నన్ను ఆపగలిగేది ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే.. రావణాసుర ట్రైలర్ రిలీజ్..

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు మనకు ఈ చిత్ర టీజర్, ట్రైలర్స్‌లో చూపెట్టారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావణాసుర చిత్రం రాబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రవితేజ మార్క్ కామెడీ కూడా ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అయితే, ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

యూట్యూబ్’లో రావణాసుర ట్రైలర్ దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. రవితేజ మరోసారి తన ఎనర్జీతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లనుండగా, ఈ సినిమాలో మరో హీరో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Ravanasura: మాస్ రాజా రావణాసుర.. ఇది పక్కా ఒరిజినల్!

ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, మేఘా ఆకాష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఏప్రిల్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే.