RCB New Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ఎవరంటే? కోహ్లీ రివీల్ చేశాడుగా..!
RCB New Captain : ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం కాబోతోంది. మార్చి 26 నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ సీజన్ మొదలు కానుంది.

Ipl 2022 Virat Kohli Teases Rcb Fans Ahead Of Captain, Other Major Announcements On March 12
RCB New Captain : ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం కాబోతోంది. మార్చి 26న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ తో ఐపీఎల్ సీజన్ ( Indian Premier League 2022 season) ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌లో పాల్గొనే 10 జట్లలో చాలావరకు ఐపీఎల్ జట్లు ఇప్పటికే తమ కెప్టెన్ ఎవరో ప్రకటించుకున్నాయి. పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ కొత్త కెప్టెన్ ప్రకటించింది. కోల్‌కతా జట్టు కూడా తమ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌గా ఎంపిక చేసుకున్నాయి. ఐపీఎల్ జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మాత్రమే ఇప్పటివరకూ కొత్త కెప్టెన్ ఎవరూ అనేది క్లారిటీ లేదు. ప్రతి సీజన్‌కు ఆర్సీబీకి విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈసారి సీజన్‌కు మాత్రం విరాట్ స్థానంలో కొత్త కెప్టెన్ రావొచ్చు అనే సంకేతాలు వినిపించాయి. ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఎవరు? కోహ్లీనే కొనసాగుతాడా లేదా అనేది సస్పెన్స్ గా నిలిచింది.
ఎందుకంటే ఇప్పటివరకూ ఆర్సీబీ కెప్టెన్ ప్రకటించలేదు. ఈ సస్పెన్స్ కు మరింత పెంచుతూ విరాట్ కోహ్లీ వీడియో ద్వారా ముందుకొచ్చాడు. కానీ, తాను ఆర్బీఐ కెప్టెన్ గా కొనసాగనున్నట్టు మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే కోహ్లి RCB కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. కోహ్లీ స్థానంలో కొత్త కెప్టెన్ ఎవరు అన్నది రివీల్ చేయలేదు. కెప్టెన్సీ రేసులో టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఉండే అవకాశం కనిపిస్తోంది. వీరిద్దరూ పేర్లు ఆర్సీబీ కెప్టెన్లుగా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మార్చి 12న ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఎవరో రివీల్ చేయబోతున్నామంటూ సస్పెన్స్ లో ఉంచింది. విరాట్ కోహ్లికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“Renewed Energy. Excited for the IPL season. There’s an important news…” – Virat Kohli has a message for all of you RCB fans! ?
Location: Museum Cross Road, Church Street, Bengaluru
Date: 12.03.2022
Time: 12pm to 8pm#PlayBold #WeAreChallengers pic.twitter.com/o26eA2bOq3— Royal Challengers Bangalore (@RCBTweets) March 10, 2022
ఆ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ఐపీఎల్ సీజన్ ఆరంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని చెప్పాడు. RCB ఫ్యాన్స్‌కు ఒక సస్పెన్స్ అంటూ హింట్ ఇచ్చాడు. 12.03.2022, సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల సమయంలో RCB కొత్త కెప్టెన్ ఎవరు అనేది అప్‌డేట్ ఇస్తామని కోహ్లీ అన్నాడు. అతడు ఎవరూ అనే విషయాన్ని కోహ్లీ చెబుతుండగా ఆర్బీఐ వాయిస్ మ్యూట్ చేసింది. కోహ్లీ వీడియోను చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్.. విరాట్ నువ్వే కెప్టెన్ గా ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీనే మళ్లీ కెప్టెన్ గా వస్తాడంటూ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ కోహ్లీనే కెప్టెన్‌గా కొనసాగనున్నాడా లేదా కొత్త కెప్టెన్ ఎవరు వస్తారు అనేది తెలియాలంటే మార్చి 12 వరకు వేచి చూడాల్సిందే..
Read Also : IPL 2022: ‘బెంగళూరు కెప్టెన్సీని కోహ్లీ వెనక్కి తీసుకోడు’