Redmi Note 12 4G Phones : అద్భుతమైన ఫీచర్లతో రెడ్‌మి నోట్ 12 సిరీస్ 4G బడ్జెట్ ఫోన్లు.. ధర కేవలం రూ.8,999 మాత్రమే.. ఫస్ట్ సేల్ ఎప్పటినుంచంటే?

Redmi Note 12 4G Phones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, రెడ్‌మి నుంచి రెండు సరికొత్త 4G బడ్జెట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అత్యంత సరసమైన ధరకే (Redmi Note 12 4G), (Redmi 12C) సిరీస్ ఫోన్లు మార్చి 30న భారత్‌లో అధికారికంగా రిలీజ్ అయ్యాయి.

Redmi Note 12 4G Phones : అద్భుతమైన ఫీచర్లతో రెడ్‌మి నోట్ 12 సిరీస్ 4G బడ్జెట్ ఫోన్లు.. ధర కేవలం రూ.8,999 మాత్రమే.. ఫస్ట్ సేల్ ఎప్పటినుంచంటే?

Redmi 12C, Redmi Note 12 4G budget phones launched in India; price starts at Rs 8,999

Redmi Note 12 4G Phones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, రెడ్‌మి నుంచి రెండు సరికొత్త 4G బడ్జెట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అత్యంత సరసమైన ధరకే (Redmi Note 12 4G), (Redmi 12C) సిరీస్ ఫోన్లు మార్చి 30న భారత్‌లో అధికారికంగా రిలీజ్ అయ్యాయి. రెండూ బడ్జెట్ ఫోన్లు.. ముఖ్యంగా 12C ఫస్ట్ టైమ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఎంట్రీ-లెవల్ ఆఫర్‌గా అందుబాటులోకి వచ్చింది.

రెడ్‌మి Note 12 4G మోడల్ ఇప్పుడు Xiaomi సబ్ బ్రాండ్ Redmi Note 12 లైనప్‌లో అత్యంత సరసమైన ఫోన్‌గా వచ్చింది. ఇందులో Redmi Note 12 5G, Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro Plus 5G కూడా ఉన్నాయి. Redmi 12C ఫోన్ Motorola G13 వంటి ఫోన్‌లతో పోటీపడుతోంది. రెడ్‌మి నోట్ 12 4G, Realme C55, Samsung Galaxy F14 5Gకి పోటీగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.

రెడ్‌మి నోట్ 12 4G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇవే :
Redmi Note 12 4G ఫోన్ 6.67-అంగుళాల 1080p AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. ఈ ప్యానెల్ 1,200నిట్స్ గరిష్ట స్థాయితో వస్తుందని షావోమీ పేర్కొంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేటుకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 183.5 గ్రాముల బరువు, 7.85 మిమీ మందంతో ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంది. షావోమీ (Xiaomi) బ్లాక్, బ్లూ, గోల్డ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. రెడ్‌మి నోట్ 12 4G ఫోన్ IP53 రేట్‌తో వచ్చింది. బయోమెట్రిక్స్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా పనిచేస్తుంది.

Read Also : BMW X3 New Price : రెండు కొత్త డీజిల్ వేరియంట్లతో BMW X3 కారు వచ్చేసింది.. కొత్త మోడల్ ధర ఎంతో తెలుసా?

హుడ్ కింద, 8GB వరకు LPDDR4X RAM, 128GB UFS2.2 స్టోరేజ్‌తో Qualcomm స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌ను అందిస్తోంది. మైక్రో-SD కార్డ్‌ని ఉపయోగించి 1TB వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14 రన్ చేస్తోంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Redmi 12C, Redmi Note 12 4G budget phones launched in India; price starts at Rs 8,999

Redmi 12C, Redmi Note 12 4G budget phones launched in India

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే. Redmi Note 12 4G వెనుక భాగంలో 50MP మెయిన్ (Samsung JN1, f/1.8), 8MP అల్ట్రావైడ్, మరో 2MP మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో, 13MP సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 12 4G 6GB/64GB, 6GB/128GB ట్రిమ్‌లలో వస్తుంది.

Redmi 12C స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇవే :
రెడ్‌మి 12C టెక్స్‌చర్డ్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. స్లిప్-రెసిస్టెంట్ గ్రిప్‌తో వచ్చింది. బరువు 192గ్రాములు, ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. వెనుకవైపు కెమెరా రేంజ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. స్పెషిఫికేషన్ల వారీగా పరిశీలిస్తే.. Redmi 12C వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.71-అంగుళాల 720p డిస్‌ప్లేను కలిగి ఉంది. షావోమీ ప్యానెల్ 500nits టాప్ చేయగలదని పేర్కొంది. హుడ్ కింద, MediaTek Helio G85 ప్రాసెసర్‌ని 6GB RAM నుంచి 128GB eMMC5.1 స్టోరేజ్‌తో వస్తుంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13 అమలు చేస్తోంది. 10W మైక్రో-USB ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే. Redmi 12C వెనుక భాగంలో 50MP ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది. Redmi 12C ఫోన్ 4GB/64GB, 6GB/128GB ట్రిమ్‌లలో వస్తుంది.

రెడ్‌మి నోట్ 12 4G, రెడ్‌మి 12C ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో Redmi 12C ఫోన్ ధర 4GB/64GBకి రూ.8,999 నుంచి ప్రారంభమవుతుంది. 6GB/128GB మోడల్ రూ.10,999కి సేల్ అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ క్రెడిట్, క్రెడిట్, డెబిట్ EMIలను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై రూ. 500 డిస్కౌంట్ అందిస్తామని షావోమీ తెలిపింది. భారత మార్కెట్లో Redmi Note 12 4G ధర 6GB/64GBకి రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది.

6GB/128GB మోడల్ రూ.16,999కి సేల్ అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ క్రెడిట్, క్రెడిట్, డెబిట్ EMIలను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై రూ. 1,000 తగ్గింపును అందిస్తామని షావోమీ వెల్లడించింది.ఇప్పటికే ఉన్న Xiaomi యూజర్లు Redmi Note 12 కొనుగోలుపై రూ. 1,500 ‘లాయల్టీ బోనస్’కి అర్హులుగా కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు ఏప్రిల్ 6 నుంచి ఫస్ట్ సేల్ అందుబాటులో ఉండనున్నాయి.

Read Also : Vodafone-Idea 5G : వోడాఫోన్ ఐడియా 5G సపోర్టు చేసే షావోమీ ఫోన్లు ఇవే.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. భారత్‌లో Vi 5G లాంచ్ ఎప్పుడంటే?