Ajwain : బరువును తగ్గించి, ఆకలిని పెంచే వాము!

గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. ఆకలి పెంచుతుంది. గర్భవతులు వాము తీసుకోవటం వల్ల రక్తం శుభ్రపడటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది.

Ajwain : బరువును తగ్గించి, ఆకలిని పెంచే వాము!

Ajwain

Ajwain : వామును ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే మెడిసిన్ గా ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. పూర్వకాలం నుండి వామును ఆరోగ్యానికి మేలు కలిగించేదిగా గుర్తిస్తూ వస్తున్నారు. జీర్ణశక్తిని పెంపొందించేందుకు దీనిని మించింది లేదు. రుచికి ఘాటుగా అనిపించినా దాని పనితీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది. జీర్ణ సంబంద సమస్యలు అయినా గ్యాస్,అజీర్ణం,కడుపు ఉబ్బరం,ఎసిడిటీ వంటి సమస్యలు లేకుండా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు.

వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యానికి సహాయ పడుతుంది. గొంతు నొప్పి,గొంతు ఇన్ ఫెక్షన్,దగ్గు వంటి వాటికి మంచి ఉపశమనం అందిస్తుంది. ప్రతి రోజు ఒక స్పూన్ వామును తినడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయానే మరిగించి చల్లార్చి పరగడుపున ప్రతి రోజు తాగటం వలన శరీర బరువును తగ్గించుకోవచ్చు. కిడ్నీలో ఉండే చిన్న రాళ్ళను కరిగిస్తుంది. పది రోజుల పాటు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.

వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర తగ్గుతుంది. చిన్న పిల్లలు అజీర్తి, కడుపునొప్పితో బాధపడుతుంటే వాము వాటర్ లో తేనె కలిపి ఇస్తే నొప్పి తగ్గిపోతుంది. గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. ఆకలి పెంచుతుంది. గర్భవతులు వాము తీసుకోవటం వల్ల రక్తం శుభ్రపడటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది. ఉదయం సమయంలో వాముపొడి, తేనె కలుపుకుని పరగడుపున తీసుకుంటే ఆస్తమా ఉన్నవారికి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఒక స్పూన్ల వాము ,చిటికెడు ఉప్పు వేసుకొని చూర్ణంలా చేసుకొని నోట్లో వేసుకొని చప్పరిస్తూ వేడినీళ్లు తాగడం వలన దగ్గు మరియు దమ్ము తగ్గుతుంది.

గమనిక: అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటం జరిగింది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ చికిత్స పొందటం మంచిది.