Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!

హార్మోన్లలో కలిగే మార్పులు , అలాగే నెలసరి మొదలైన తర్వాత శరీరంలో వచ్చే తేడాల గురించి పిల్లలకు వివరించాలి. లైంగికపరమైన అవగాహన కలిగేలా వారికి తెలియజేయాలి. అవయవాల గురించి వారి సందేహాలను, వాటి పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజెప్పటం మంచిది.

Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!

Adolescent Children

Updated On : May 21, 2022 / 2:39 PM IST

Adolescent Children : యుక్తవయసులో అతి సాధారణమైన ఈ అంశాలపై అవగాహన పిల్లల్లో చాలా అవసరం. యుక్త వయసుకొచ్చేసరికి పిల్లలకు ఎన్నో సందేహాలు వారిలో వస్తుంటాయి. వాటి గురించి పిల్లల అడిగిన సందర్భంలో వారిని విసుక్కోవటం, కసురుకోవటం, వాటి గురించి మీకెందుకులే అనటం వంటివి చేయటం ఏమాత్రం సరైంది కాదు. ఇలా చేస్తే వారి ఆసక్తి మొత్తం వాటిపైనే ఉండే అవకాశం ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవాల్సన్న అతృత మరింత పెరుగుతుంది. చదువు నుంచి వారి దృష్టి వేరే వాటిపైకి మరలకుండా ఉండేందుకు వారిలో వచ్చే సందేహాలను నివృత్తి చేయటం మంచిది. ముఖ్యంగా లైంగిక పరమైన అంశాలు, నెలసరి వంటి వాటి గురించి యుక్త వయసు ఆడపిల్లలకు తల్లిగా అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

హార్మోన్లలో కలిగే మార్పులు , అలాగే నెలసరి మొదలైన తర్వాత శరీరంలో వచ్చే తేడాల గురించి పిల్లలకు వివరించాలి. లైంగికపరమైన అవగాహన కలిగేలా వారికి తెలియజేయాలి. అవయవాల గురించి వారి సందేహాలను, వాటి పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజెప్పటం మంచిది. వయసులో పాటించాల్సిన హద్దులను , మంచి, చెడు స్పర్శలకు తేడా చెప్పాలి. బడిలో, బయటా, లేదా ఇంట్లో వారికి ఇబ్బందికరమైన సందర్భాలెదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలిగేలా పిల్లలను సన్నధ్ధం చేయాలి. ఈ వయసు పిల్లలతో అమ్మానాన్నలు వీలైనంత స్నేహంగా వ్యవహరించాలి.

యుక్తవయసులో దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, కెరియర్‌ను మలచుకునే సమయాన్ని వృథా చేస్తే అది భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపిస్తుందో వారికి తెలియజెప్పాలి. అప్పుడే వారిలో అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది. తద్వారా వారు అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండే సరైన మార్గంలో అడుగులు వేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వక్రమార్గాల వైపుకు వెళ్ళకుండా చూసుకోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు వివరించలేని సందర్భం ఎదుర్కొంటే నిపుణుల వద్దకు పిల్లలను తీసుకువెళ్ళి వారికి తగిన కౌన్సిలింగ్ ఇప్పించం మంచిది.