RRR : ‘బాహుబలి’ హిస్టరీ.. ‘ఆర్ఆర్ఆర్’ హిస్టారికల్.. ఆర్జీవీ కామెంట్స్..

టీవల కశ్మీర్ ఫైల్స్ సినిమాని పొగుడుతూ ట్వీట్స్ పై ట్వీట్స్ చేసిన ఆర్జీవీ తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమాపై కూడా ట్వీట్ చేశాడు. ''బాహుబలి 2 అనేది చరిత్ర. 'ఆర్‌ఆర్‌ఆర్‌' అనేది.............

RRR : ‘బాహుబలి’ హిస్టరీ.. ‘ఆర్ఆర్ఆర్’ హిస్టారికల్.. ఆర్జీవీ కామెంట్స్..

Rgv

RGV :  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చరణ్, తారక్ లాంటి స్టార్ హీరోలతో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సినిమాకి కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పటికే మొదటి రోజు 223 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డులని సృష్టిస్తుంది. ఇక ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులతో సహా దేశ వ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కామెంట్ చేశాడు.

ఆర్జీవీ ఏం మాట్లాడాలన్నా తన ట్విట్టర్లోనే మాట్లాడతాడు. తాను చేసే ట్వీట్స్ తోనే అన్నిటి గురించి తెలుపుతాడు. అందరికి వ్యతిరేకంగా, వ్యంగ్యంగా పోస్టులు వేస్తూ ఉంటాడు ఆర్జీవీ. అప్పుడప్పుడు నిజాలు కూడా చెప్తూ ఉంటాడు. ఇక సినిమాల గురించి అయితే కచ్చితంగా పోస్ట్ చేస్తాడు. ఇటీవల కశ్మీర్ ఫైల్స్ సినిమాని పొగుడుతూ ట్వీట్స్ పై ట్వీట్స్ చేసిన ఆర్జీవీ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కూడా ట్వీట్ చేశాడు.

RRR: ఫస్ట్ డే కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్

”బాహుబలి 2 అనేది చరిత్ర. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనేది చారిత్రాత్మకం. బాక్సాఫీస్‌కు మోక్షం కలిగించిన గొప్ప వ్యక్తి రాజమౌళి” అంటూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని, రాజమౌళిని పొగుడుతూ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.