RRR: ఫస్ట్ డే కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్

మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.....

RRR: ఫస్ట్ డే కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్

RRR

RRR: మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలానా ఏరియా అని సంబంధం లేకుండా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైన అన్ని ప్రాంతాల్లోనూ కళ్లుచెదిరే కలెక్షన్లతో దూసుకుపోతుంది ఈ సినిమా. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ మూవీలో తారక్, చరణ్‌లు హీరోలుగా నటించడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.

RRR: ఆర్ఆర్ఆర్‌పై మహేష్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

ఇక క్లాస్, మాస్ అనే తేడాలు లేకుండా అన్ని సెంటర్లలో ఈ సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. తొలిరోజే ఈ సినిమా ఇండియన్ సినిమాలో ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.223 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. గతంలో బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డులను ఆర్ఆర్ఆర్ చెరిపేయడంతో తారక్, చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

RRR: ప్రభాస్ కోసం ట్రిపుల్ఆర్ స్పెషల్ షో..?

ఇక వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు మరో రెండు రోజుల్లో మరింతగా పెరుగుతాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. పీరియాడిక్ ఫిక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీం పాత్రల్లో నటించారు. డివివి దానయ్య ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.