Riya Kapoor : ప్రియుడితో రియా కపూర్‌ పెళ్లి

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ చిన్న కుమార్తె రియా కపూర్‌, తన ప్రియుడు కరణ్‌ బూలానీని పెళ్లి చేసుకోనున్నారు.

Riya Kapoor : ప్రియుడితో రియా కపూర్‌ పెళ్లి

Ria Kapoor

Riya Kapoor Karan Boolani : బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ చిన్న కుమార్తె రియా కపూర్‌, తన ప్రియుడు కరణ్‌ బూలానీని పెళ్లి చేసుకోనున్నారు. ఇవాళ జూహూలోని కపూర్‌ బంగ్లాలో వివాహం జరుగనుంది. అయితే ఈ వేడుక ప్రైవేట్‌గా ఉంటుందని బాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకలు రెండు నుంచి మూడు రోజల వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

కానీ ఇప్పటి వరకు కపూర్‌ ఫ్యామిలీ రియా పెళ్లి వార్తలను ధృవీకరించలేదు. అయితే కరణ్‌ జుహూలోని అనిల్‌ కపూర్‌ ఇంటి వద్ద సందడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో శనివారమే రియా, కరణ్‌లు ఒక్కటవ్వుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌ నిర్మాత రియా కపూర్‌, కరణ్‌తో గత 13 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కరణ్‌ బూలానీ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎన్నో యాడ్స్‌ను నిర్మించారు. రియా కపూర్ నిర్మించిన ఐషా, వేక్ అప్ సిడ్ వంటి చిత్రాలకు సహాయ నిర్మాతగా పని చేశాడు. రియా కపూర్‌, కరణ్‌ బూలానీలో ప్రేమలో ఉన్నారంటూ కొన్నిరోజులగా రూమర్లు వినిపిస్తున్నాయి. కపూర్‌ కుటుంబానికి సంబంధించిన ప్రతీ వేడుకలోనూ కరణ్‌ భాగం కావడం వీటికి మరింత బలాన్ని చేకూర్చింది.

దీనికితోడు కొన్నిరోజుల క్రితం సోనమ్‌ కపూర్ తల్లి సునీత కపూర్‌.. భర్త, కూతుళ్లు, కొడుకు, పెద్దల్లుడు ఆనంద్‌ అహుజాలతో పాటు కరణ్‌ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘నాకు ఇష్టమైన వ్యక్తులతో మరో కొత్త ప్రేమకథను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా’ అంటూ క్యాప్షన్‌ జత చేసి హింట్‌ ఇచ్చారు. అయితే సోనమ్‌ ఇంటర్వ్యూతో ఈ వార్త కన్ఫామ్‌ అయ్యింది.