Rohit Sharma: ఫ్రెండ్స్ అంటూ స్పెషల్ మెసేజ్ ఇచ్చిన రోహిత్ శర్మ

అమెరికన్ సీరియల్ ఫ్రెండ్స్ F.R.I.E.N.D.S అంటూ జరిగే గెట్ టూ గేదర్ సీరియల్ గురించి తెలిసే ఉంటుంది. రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా దానినే ప్రస్తావిస్తూ... ఓ ట్వీట్ పోస్టు చేశాడు.

Rohit Sharma: ఫ్రెండ్స్ అంటూ స్పెషల్ మెసేజ్ ఇచ్చిన రోహిత్ శర్మ

Rohit Sharma Has A Special Message For His F R I E N D S

Rohit Sharma: అమెరికన్ సీరియల్ ఫ్రెండ్స్ F.R.I.E.N.D.S అంటూ జరిగే గెట్ టూ గేదర్ సీరియల్ గురించి తెలిసే ఉంటుంది. రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా దానినే ప్రస్తావిస్తూ… ఓ ట్వీట్ పోస్టు చేశాడు. F.R.I.E.N.D.S నేను ఈ రీ యూనియన్నే కోరుకుంటున్నా. దీని కోసమే వెయిట్ చేస్తున్నా అని పోస్టు చేశాడు.

దాంతో పాటు నేషనల్ టీం జెర్సీలో రోహిత్.. స్టేడియంలో కూర్చొని అరుస్తోన్న అభిమానుల వైపు తిరిగిన ఫొటోను పోస్టు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ నాటి ఓ ఫొటోను ట్వీట్‌ చేశాడు. ఆ మెగా టోర్నీలో 9 మ్యాచుల్లో 648 పరుగులు చేయడమే కాకుండా రికార్డు స్థాయిలో 5 సెంచరీలు బాదేశాడు.

అలా చేసిన సెంచరీల్లో ఒక సెంచరీ తర్వాత అభిమానులను చూస్తూ హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ పైకెత్తిన ఫొటో అది. కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం స్టేడియంలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. గతేడాది ఐపీఎల్‌తో పాటు పలు అంతర్జాతీయ సిరీస్‌లు సైతం స్టేడియంలో ఎవరూ లేకుండానే నిర్వహించారు. అయినప్పటికీ కొంతమంది ప్లేయర్లకు పాజిటివ్ వచ్చిందని ఐపీఎల్ 2021ని అర్ధాంతరంగా ఆపేశారు.

స్టేడియంలోకి కొద్ది కాలంగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు సగం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నాయి. ఇక జూన్‌ 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు 4 వేల మందిని అనుమతించనున్నట్లు ఇంగ్లాండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది.