Rohit Sharma: రేప‌టి నుంచి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. రోహిత్ శ‌ర్మ‌కు గాయం..! ఆందోళ‌న‌లో అభిమానులు

లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్(WTC Final 2023) మ్యాచ్ బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ కీల‌క మ్యాచ్‌కు ఒక్క రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌గా టీమ్ఇండియా(Team India) అభిమానుల‌ను ఇప్పుడు ఓ వార్త షాక్‌కు గురి చేస్తోంది.

Rohit Sharma: రేప‌టి నుంచి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. రోహిత్ శ‌ర్మ‌కు గాయం..! ఆందోళ‌న‌లో అభిమానులు

Rohit Sharma injury

Rohit Sharma injury: లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్(WTC Final 2023) మ్యాచ్ బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ కీల‌క మ్యాచ్‌కు ఒక్క రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌గా టీమ్ఇండియా(Team India) అభిమానుల‌ను ఇప్పుడు ఓ వార్త షాక్‌కు గురి చేస్తోంది. భార‌త కెప్టెన్‌, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం రోజు ప్రాక్టీస్ చేస్తుండ‌గా రోహిత్ ఎడ‌మ బొట‌న‌వేలికి గాయ‌మైంది. వెంట‌నే ఫిజియోలు వ‌చ్చి గాయానికి చికిత్స అందించారు.

దీంతో కొద్ది సేపు రోహిత్ మైదానాన్ని విడిచివెళ్లాడు. ఫైన‌ల్ మ్యాచ్ కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్న ఆందోళ‌న‌లో అభిమానులు ఉన్నారు. అయితే.. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంత‌రం హిట్‌మ్యాన్ తిరిగి ప్రాక్టీస్‌ను కొన‌సాగించిన‌ట్లుగా తెలుస్తోంది.కాగా.. రోహిత్ శ‌ర్మ గాయంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా రోహిత్ వేలికి స్కానింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

WTC Final 2023: ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ గ‌ద‌తో భార‌త్‌, ఆస్ట్రేలియా కెప్టెన్లు

ఒక‌వేళ రేప‌టి మ్యాచ్‌కు రోహిత్ శ‌ర్మ దూరం అయితే అది టీమ్ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. బ్యాట‌ర్ గానే కాకుండా కెప్టెన్‌గా రోహిత్ అవ‌స‌రం జ‌ట్టుకు ఎంతో ఉంది. ముఖ్యంగా రోహిత్‌కు ఇంగ్లాండ్‌లో అద్భుత రికార్డు ఉంది. 5 టెస్టుల్లో 402 ప‌రుగులు చేశాడు. ఇదిలా ఉంటే..2013లో టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ అందుకుంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే ఐసీసీ ట్రోఫీని అందుకోలేక‌పోయింది. దీంతో దాదాపు ప‌దేళ్ల క‌రువును రోహిత్ తీర్చాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

WTC ఫైనల్‌కు భారత జట్టు ఇదే:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మ‌హమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్‌)

స్టాండ్‌బై ఆటగాళ్లు: య‌శ‌స్వి జైశ్వాల్‌, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.

Rinku Singh: రింకూ సింగ్ సిక్స్ ప్యాక్.. శుభ్‌మ‌న్ గిల్ సోద‌రి కామెంట్‌