Shaakuntalam: ఋషివనంలోన శకుంతల, దుష్యంతుడి ప్రేమగీతం.. వినసొంపుగా ఉందిగా!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత శకుంతల పాత్రలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Shaakuntalam: ఋషివనంలోన శకుంతల, దుష్యంతుడి ప్రేమగీతం.. వినసొంపుగా ఉందిగా!

Romantic Rushivanamlona Song From Shaakuntalam Impressive

Shaakuntalam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత శకుంతల పాత్రలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Shaakuntalam: ‘రుషివనంలోన’ శాకుంతలం ఆటపాటలు.. సెకండ్ సింగిల్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్!

కాగా, తాజాగా ఈ సినిమా నుంచి ‘ఋషివనంలోన’ అనే రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసంది. ఈ పాట ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో, శ్రోతలు ఈ పాటను పదేపదే వింటున్నారు. శ్రీమణి అందించిన చక్కటి సాహిత్యానికి మణిశర్మ అదిరిపోయే కంపోజిషన్ తోడవడంతో ఈ పాట వినసొంపుగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయిలు కలిసి పాడిన తీరు ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది.

Shaakuntalam: శాకుంతలం డిజిటల్ రైట్స్.. భారీ రేటుకు సొంతం చేసుకున్న ప్రైమ్..?

ఈ పాట ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింత పెంచేవిధంగా ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను నీలిమా గుణ ప్రొడ్యూస్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.